Begin typing your search above and press return to search.
ఏపీలో ఈ వారం రాబోతున్న సినిమాల పరిస్థితి ఏంటీ?
By: Tupaki Desk | 1 March 2022 7:10 AM GMTగత వారం బాక్సాఫీస్ ముందుకు పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా ఏపీలో టికెట్ల రేట్లు తక్కువగా ఉండటం వల్ల వసూళ్లు సాదా సీదాగా నమోదు అయ్యాయి. చాలా చోట్ల షో లను వేయడం మా వల్ల కాదంటూ సింగిల్ స్క్రీన్ థియేటర్ల వారు మూసి వేసుకున్నారు. పవన్ సినిమా అయినా ఇలాంటి పరిస్థితులు ఉండటం దారుణం అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు.
భీమ్లా నాయక్ సినిమా విడుదల అయిన వారం రోజుల తర్వాత అంటే ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు మరియు సెబాస్టియన్ సినిమాలకు ఏపీలో పరిస్థితులు ఎలా ఉంటాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇద్దరు కూడా మీడియం రేంజ్ హీరో లు కనుక బెనిఫిట్ షో లు సాదారణంగా కూడా ఉండే అవకాశాలు లేవు. మీడియం బడ్జెట్ సినిమాలు కనుక అదనపు షో అక్కర్లేదు.
కాని టికెట్ల రేట్లు ఏపీలో అంతే తక్కువ ఉంటే మాత్రం ఈ సినిమాలకు చాలా కష్టం. కనుక ఆ సినిమాలపై పాత జీవో ఎలా పని చేస్తుంది అనేది చూడాలి. భీమ్లా నాయక్ కు ముందు విడుదల అయిన బంగార్రాజు మరియు అఖండ సినిమాలకు టికెట్ల రేట్లు తక్కువ ఉన్న జీవో అమలులో ఉన్నా కూడా అధికారులు పెద్దగా పట్టించుకోక పోవడంతో ఎక్కువ రేటు పెట్టి అమ్మారు. దాంతో ఆ సినిమాలకు పెద్దగా నష్టం ఏమీ రాలేదు.
అఖండ సినిమా కు కొన్ని చోట్ల ప్రభుత్వ రేట్లకు అమ్మినా ఎక్కువ చోట్ల బయ్యర్లు అనుకున్న రేట్లకు అమ్ముకున్నారనే టాక్ ఉంది. ఆ విషయం ఎంత వరకు నిజం అనేది తెలియదు.. కాని ఇప్పుడు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు కూడా టికెట్ల రేట్లు పెంచి అమ్ముకునే అవకాశం ఉండవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ శుక్రవారం వరకు కొత్త జీవో వచ్చే అవకాశం కచ్చితంగా లేదనే అంతా అంటున్నారు.
ఒకవేళ కొత్త జీవో ఇప్పుడు ఇస్తే భీమ్లా నాయక్ వల్లే ఆలస్యం చేశారు అనే ఆరోపణలు మరింతగా వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా భీమ్లా నాయక్ కు ఇంకా మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి కనుక లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ లెక్కలు ఉన్న కారణంగా రాధేశ్యామ్ సినిమా విడుదల వరకు టికెట్ల రేట్ల విషయంలో నిర్ణయం తీసుకుని జీవో తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త జీవోలు రాకున్నా కూడా భీమ్లా నాయక్ థియేటర్ల వద్ద హడావుడి చేసినట్లుగా రెవిన్యూ అధికారులు సెబాస్టియన్ మరియు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా థియేటర్ల వద్ద హడావుడి చేసే అవకాశం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే ఏపీలో మంచి వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.