Begin typing your search above and press return to search.

అడ‌వుల‌ను వ‌ద‌ల‌ని పుష్ప‌రాజ్‌.. ఏంటి క‌థ‌?

By:  Tupaki Desk   |   2 Sep 2021 11:30 AM GMT
అడ‌వుల‌ను వ‌ద‌ల‌ని పుష్ప‌రాజ్‌.. ఏంటి క‌థ‌?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ గోదావ‌రి ప‌రిస‌రాల్లోని మారేడుమిల్లిలో నిధినిక్షేపాలు దాగి ఉన్నాయా? ఏమో ప‌దే ప‌దే పుష్ప రాజ్ ఇక్క‌డి అడ‌వుల‌కు రిపీటెడ్ గా తిరిగేస్తుండ‌డం చూస్తుంటే ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్త‌మవుతున్నాయి. అల్లు అర్జున్ - రష్మిక మందన్న- ఫ‌హ‌ద్ ఫాజిల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న `పుష్ప` పాన్-ఇండియా యాక్షన్ డ్రామా క‌థాంశంతో తెర‌కెక్కుతోంది.

గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్ల క‌థ‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఈరోజు చివరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. చిత్ర బృందం మారేడుమిల్లికి బయలుదేరింది. ఇక్క‌డ‌ రెండు వారాల్లో మొత్తం షూటింగ్ ఫార్మాలిటీలను పూర్తి చేయ‌నుంది.

ద‌స‌రా బ‌రిలో పుష్ప రిలీజ‌వుతుంద‌ని ప్ర‌చార‌మైనా.. క్రిస్మస్ సీజన్ కి వాయిదా ప‌డింద‌ని ఇటీవ‌ల క‌థ‌నాలొచ్చాయి. ఈ సినిమా కి దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందని దర్శకుడు సుకుమార్ రాజీకి రాని రీతిలో తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మ‌ల‌యాళీ ట్యాలెంటెడ్ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాజిల్ విల‌న్ గా న‌టిస్తుండ‌గా.. యువ శాండల్ వుడ్ నటుడు ధనంజయ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఫ‌హ‌ద్ లుక్ ని ఇటీవ‌ల రిలీజ్ చేయ‌గా అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తో క‌లిసి ముత్తంశెట్టి మీడియా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది. దేవీశ్రీ సంగీతం అందిస్తున్నారు.

క‌మ‌ల్ స్ఫూర్తితో బ‌న్ని హార్డ్ వ‌ర్క్..

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ `భార‌తీయుడు` సేనాప‌తి లుక్ కోసం రోజుకు 4 గంట‌లు మేక‌ప్ కే టైమ్ కేటాయించేవారు. ఆ త‌ర్వాత ద‌శావ‌తారం కోసం ఏడెనిమిది గంట‌లు మేక‌ప్ కోస‌మే వెయిట్ చేసేవారని విన్నాం. ఇటీవ‌ల విశ్వ‌రూపం వేష‌ధార‌ణ కోసం క‌మ‌ల్ అంతే అంకిత‌మ‌య్యారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా క‌మ‌ల్ హాస‌న్ ని స్ఫూర్తిగా తీసుకుని పుష్ప కోసం మేక‌ప్ ప‌రంగా వైవిధ్యం పాటిస్తున్నారు.

యాక్షన్ థ్రిల్లర్ పుష్పలో బ‌న్ని పూర్తి మాస్ అవ‌తారంలో క‌నిపించ‌నున్నారు. మోటైన పాత్ర కోసం అద్భుతమైన మేకోవర్ తో స‌ర్ ప్రైజ్ చేస్తున్నారు. ఈ పాత్ర‌లో ఊర‌మాస్ కి ప‌రాకాష్ట‌గా క‌నిపించ‌నున్నార‌ని ఇంత‌కుముందు రివీలైన విజువ‌ల్స్ చెబుతున్నాయి. ఇందులో భయంకరమైన ఎర్రచందనం స్మగ్లర్ గా బ‌న్ని నటిస్తున్నాడు. త‌న పాత్ర కోసం అల్లు అర్జున్ ప్రతిరోజూ 2 గంటలు మేకప్ కోసం శ్రమిస్తున్నారు. బాగా మిసిన రింగుల‌జుత్తు గ‌డ్డం.. షేపులు కోల్పోయిన వీర ముదురు గెట‌ప్ కోసం టాన్ టచ్ అప్ లు చేయించుకుంటున్నాడు బ‌న్ని. అల్లు అర్జున్ మేకప్ వేసుకోవడానికి రోజుకు రెండు గంటలు స‌మ‌యం తీసుకుంటున్నాడు. మేక‌ప్ ని తొల‌గించ‌డానికి ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తున్నారని స‌మాచారం. పుష్ప చిత్రీక‌ర‌ణ అనంత‌రం ఐక‌న్ చిత్రీక‌ర‌ణ‌లో బ‌న్ని జాయిన‌వుతారు. ఆ త‌ర్వాత పుష్ప 2 ని తెర‌కెక్కిస్తారు. పుష్ప 2 పార్ట్ 1 కి కొన‌సాగింపు క‌థ‌తో తెర‌కెక్క‌నుంది.