Begin typing your search above and press return to search.

హిందీ 'అల వైకుంఠపురములో' చిత్రానికి టైటిల్ అదేనా..?

By:  Tupaki Desk   |   21 Jun 2021 8:30 AM GMT
హిందీ అల వైకుంఠపురములో చిత్రానికి టైటిల్ అదేనా..?
X
తెలుగులో అల్లు అర్జున్ - పూజాహెగ్డే జంటగా నటించిన సూపర్ హిట్ 'అల వైకుంఠపురములో' సినిమా హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు డేవిడ్ ధావన్ తెరకెక్కించే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు.. నటీనటులను ఎంపిక పూర్తైనట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్స్ కార్తీక్ ఆర్యన్ - కృతి సనన్ హీరోహీరోయిన్లుగా ఈ సినిమా రూపొందనుంది. అయితే హిందీ 'అల..' చిత్రానికి టైటిల్ గురించి తాజాగా ఓ వార్త వినిపిస్తోంది.

'అల వైకుంఠపురములో' హిందీ రీమేక్ చిత్రానికి ''షెహజాదా'' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 'షెహ్ జాదా' అంటే 'యువరాజు' అని అర్థం. ఈ సినిమా కథకు తగ్గట్లు ఇదే సరైన టైటిల్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే తెలుగులో టబు పోషించిన పాత్రలో సీనియర్ నటి మనీషా కొయిరాల నటించనుందని టాక్ వినిపిస్తోంది. ముందుగా ఆ పాత్ర కోసం టబు నే సంప్రదించగా.. ఆమె డేట్స్ ఖాళీ లేకపోవడంతో మనీషా కొయిరాల వద్దకు చేరిందని అంటున్నారు.

అలానే మరో కీలకమైన పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ నటించనున్నట్లు బీ టౌన్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ - మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అక్టోబర్ లో హిందీ 'అల వైకుంఠపురములో' సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.