Begin typing your search above and press return to search.
సమంత కు సర్జరీ వార్తల్లో నిజమెంత..?
By: Tupaki Desk | 20 Sep 2022 11:30 PM GMTదక్షిణాది అగ్ర కథానాయికలలో ఒకరైన సమంత రూత్ ప్రభు.. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా వుంది. అందులో తెలుగు తమిళ సినిమాలతో పాటుగా బాలీవుడ్ మరియు హాలీవుడ్ చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే గత కొన్ని వారాలుగా సామ్ ఇన్ యాక్టీవ్ గా ఉండటంతో నెట్టింట అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి.
సమంతకు ఇటీవల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయని.. ఆమె చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఈ కారణం చేతనే సామ్ కొన్ని రోజులుగా షూటింగులన్నీ ఆపేసిందని చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు ట్రీట్ మెంట్ కోసం అమెరికా కు వెళ్లినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
ఈ క్రమంలో యూఏస్ఏ లో స్కిన్ ఎలర్జీకి సంబంధించి సమంతకు చిన్నపాటి సర్జరీ చేయనున్నారని సోషల్ మీడియాలో రూమర్లు వినిపిస్తున్నాయి. చికిత్స తరవాత అమెరికా నుంచి తిరిగొస్తుందని.. కాస్త విశ్రాంతి తీసుకొని యధావిధిగా షూటింగులలో పాల్గొంటుందని అంటున్నారు.
సమంత కు సర్జరీ అని రూమర్స్ స్ప్రెడ్ అవ్వడంతో ఆమె అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇందులో నిజమెంతనే దానిపై ఆరాలు తీస్తున్నారు. తన వ్యక్తిగత జీవితంలో జరిగిన విషయాల నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తోందని సంతోషిస్తుంటే.. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ అంటున్నారేంటి అని కలవరపడుతున్నారు. సామ్ వీటిపై నోరు విప్పు పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇకపోతే సమంత ఇప్పటికే 'శాకుంతలం' మరియు 'యశోద' వంటి రెండు పాన్ ఇండియా చిత్రాలను పూర్తి చేసింది. అందులో ఒకటి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంటే.. మరొకటి రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక విజయ్ దేవరకొండ తో కలిసి చేస్తున్న 'ఖుషి' సినిమా సెట్స్ మీద ఉంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' సినిమా తెరకెక్కుతోంది. సమంత ఈ సినిమాకి ఈ నెల 5 నుంచి డేట్లు ఇచ్చిందట. అయితే ఆమె షూటింగ్ లో పాల్గొనకపోవడంతో.. హీరోయిన్ లేని సన్నివేశాలను చిత్రీకరించారట. కానీ ఇప్పుడు సామ్ అమెరికా లో చికిత్స తీసుకునేది నిజమే అయితే మాత్రం షూటింగ్ పూర్తవ్వడానికి టైం పడుతుంది.
'ఖుషి' తదుపరి షెడ్యూల్ అక్టోబర్ రెండో వారం నుంచి ఉంటుందని టాక్ వుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితేనే.. చెప్పిన సమయానికి సినిమా విడుదల సాధ్యం అవుతుందని కూడా అంటున్నారు. డిసెంబర్ 23న ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది సమంత షూటింగ్ లో పాల్గొనేదాన్ని బట్టి ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే సామ్ కు సంబంధించిన అన్ని విషయాలపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.
కాగా, 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ మరియు 'పుష్ప' ఐటమ్ సాంగ్ తో నార్త్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన సమంత.. వచ్చే ఏడాది బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. హీరోయిన్ తాప్సీ పన్ను నిర్మాణంలో ఓ హిందీ ప్రాజెక్ట్ కమిట్ అయిందని స్పష్టత వచ్చింది. ఇదే క్రమంలో అక్షయ్ కుమార్ - ఆయుష్మాన్ ఖురాన్ మరియు వరుణ్ ధావన్ వంటి హీరోలతో నటించనుందని టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.