Begin typing your search above and press return to search.
పవన్ ఉస్తాద్ విషయంలో ఏంటీ ఈ కన్ఫ్యూజన్?
By: Tupaki Desk | 28 Dec 2022 2:22 PM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ `హరి హర వీరమల్లు`లో నటిస్తున్నారు. గత కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు శరవేగంగా షూటింగ్ జరుపుకుంతోంది. ఏ.ఎం. రత్నం అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ గత కొన్ని రోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని 17వ శతాబ్ద కాలం నాటి మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.
ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు పవన్ కల్యాణ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో `భవదీయుడు భగత్ సింగ్` మూవీని ప్రకటించడం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ప్రకటించి దాదాపు రెండేళ్లవుతున్నా ఎంతకు ముందుకు వెళ్లకపోవడంతో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఈ ప్రాజెక్ట్ వుంటుందా? వుండదా? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తమిళ హిట్ మూవీ `థేరీ` ఆధారంగా ఓ సినిమాకు శ్రీకారం చుట్టిన పవన్ దీనికి హరీష్ శంకర్ ని డైరెక్టర్ గా ఎంచుకుని ఫ్యాన్స్ కి షాకిచ్చాడు.
పైగా ఈ మూవీ టైటిల్ ని `ఉస్తాద్ భగత్ సింగ్` గా మార్చడంతో ఇక `భవదీయుడు భగత్ సింగ్` ప్రాజెక్ట్ స్టోరీ ఎండ్ అయింది. రీసెంట్ గా `ఉస్తాద్ భగత్ సింగ్`ని లాంఛనంగా పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టి అదే రోజు నుంచి షూటింగ్ కూడా ప్రారంభించారు. ఈ రీమేక్ పై అభిమానులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడం.. ఏకంగా ఓ లేడీ ఫ్యాన్ ఈ రీమేక్ ని ఆపకపోతే సూసైడ్ చేసుకుంటానంటూ సూసైడ్ నోట్ ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో పవన్ `థేరీ` రీమేక్ హాట్ టాపిక్ గా మారింది.
అయితే అభిమానులు కామెంట్ లని, అభ్యంతరాలని పట్టించుకోని పవన్ , హరీష్ శంకర్ `థేరీ `రీమేక్ ని పట్టాలెక్కించారు. ఇదిలా వుంటే ఈ ప్రాజెక్ట్ కు దిల్ రాజు చేసిన పని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ని కంగారు పెడుతూ కన్ఫ్యూజన్ కు గురిచేస్తోందట. కారణం ఏంటంటే హరీష్ శంకర్ డైరెక్షన్ లో తమిళ హీరో శివకార్తికేయన్ తో దిల్ రాజు రీసెంట్ గా ఓ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఆ ప్రాజెక్ట్ ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్ల నుందట.
ఈ ప్రాజెక్ట్ కారణంగా `ఉస్తాద్ భగత్ సింగ్` షూటింగ్ కి అంతరాయం ఏర్పడే అవకాశం వుందని అభిమానులు కంగారు పడుతున్నారట. అయితే ఈ వార్తల్లో నిజం లేదని, `హరి హర వీరమల్లు`తో పాటే పవన్ `ఉస్తాద్ భగత్ సింగ్`ని పూర్తి చేయబోతున్నాడని. `హరి హర వీరమల్లు` తరువాత ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసుకున్నాడట. అయితే తాజాగా వినిపిస్తున్న పుకార్లే అభిమానులని కంగారు పెట్టిస్తున్నాయట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.