Begin typing your search above and press return to search.
ట్యాలెంటెడ్ డైరెక్టర్ లో ఏంటో ఈ గందరగోళం?
By: Tupaki Desk | 1 March 2021 11:30 AM GMTఇటీవల స్టార్ డైరెక్టర్ల సరళిని పరిశీలిస్తే.. వెంట వెంటనే సినిమాలు చేసేయడం లేదు. హిట్టు పడినా ఆచితూచి అడుగులేస్తున్నారు. ముఖ్యంగా హిట్టిచ్చినా కానీ ఆ దర్శకుడికి వెంటనే హీరోలు అవకాశాలిచ్చేయడం లేదు. స్క్రిప్టు కుదరకపోతే ప్రాజెక్టు అనుకున్నట్టు సెట్టవడం లేదు. ఇటీవల చాలా మంది సీనియర్ జూనియర్ దర్శకులకు ఇవే అనుభవాలు ఎదురయ్యాయి.
అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా పరిస్థితి అందుకు మినహాయింపేమీ కాదు. సందీప్ రెడ్డి వంగా ప్రతిభ గురించి ఎలాంటి సందేహాలు లేవ్. అర్జున్ రెడ్డితో టాలీవుడ్ లో .. కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో సంచలనాలు సృష్టించిన ఈ యువ ట్యాలెంటు మరో సినిమాని ప్రారంభించేందుకు ఏడాది పైగానే వేచి చూశారు. ఎట్టకేలకు రణబీర్ కపూర్ తో యానిమల్ అనే క్రేజీ చిత్రాన్ని ప్రకటించారు. అయితే ఈ మూవీ కూడా అంతకంతకు ఆలస్యమవుతుండడమే కలవరపెట్టే అంశం. సందీప్ లాంటి ప్రతిభావంతుడు ఇంతకాలం వేచి చూడాల్సి వచ్చిందా? అన్నదే అర్థం కాని గందరగోళం.
యానిమల్ సినిమాకి సంబంధించిన వర్క్ ఇప్పటికే మొదలైంది. 2022 దసరా కానుకగా విడుదల కానుంది. ఆ మేరకు సందీప్ వంగానే ఈ విషయాన్ని వెల్లడించడంతో ఈ కొత్త ఏడాదిలో అయినా అతడి నుంచి సినిమా చూడగలం అన్న ధీమా అభిమానులకు కలిగింది. అయితే అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తీసిన అతడి నుంచి మరో తెలుగు సినిమా ఎప్పుడు? అన్నదే సందిగ్ధంగా మారింది. ఇటీవల ఓటీటీ కోసం సందీప్ వంగా ఓ సినిమా చేస్తున్నారని ప్రచారమైంది. కానీ దానికి సంబంధించిన తాజా అప్ డేట్ ఏదీ లేదు.
ప్రస్తుతం యానిమల్ పైనే అతడి దృష్టి. ఈ సినిమాతో మరోసారి హిందీ బాక్సాఫీస్ ని షేక్ చేసి సత్తా చాటాలనుకుంటున్నాడు. ఒకవేళ అదే జరిగితే అతడు మళ్లీ మళ్లీ బాలీవుడ్ కే అంకితమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే సందీప్ లాంటి ట్యాలెంట్ టాలీవుడ్ గురించి కూడా ఆలోచిస్తేనే బావుంటుందేమో!