Begin typing your search above and press return to search.

కొత్త‌గా ఈ కిరికిరి ఏంటి సిద్దార్ధ్?

By:  Tupaki Desk   |   14 May 2022 9:30 AM GMT
కొత్త‌గా ఈ కిరికిరి ఏంటి సిద్దార్ధ్?
X
'బోయ్స్' సినిమాతో ఎంట్రీ ఇచ్చి అటుపై స్టార్ హీరోగా ఎదిగిన సిద్దార్ధ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. 'బొమ్మ‌రిల్లు' హిట్ తో సిద్దార్ధ్ తెలుగింట కుర్రాడైపోయాడు. అప్పటి నుంచి వ‌రుస‌గా సినిమాలు చేస్తే తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు. అయితే అటుపై చేసిన కొన్ని ప్ర‌య‌త్నాలు బెడిసి కొట్ట‌డంతో ఆ ప్రభావం మార్కెట్ పై ప‌డింది.

దీంతో సిద్దార్థ్ పూర్తిగా కోలీవుడ్ కే ప‌రిమిత‌మ‌య్యాడు. ఈ మ‌ధ్య‌నే 'మ‌హా స‌ముద్రం' సినిమాతో కంబ్యాక్ అయ్యాడు. ఈ సినిమాపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు. కానీ ఫ‌లితం నిరాశ‌ప‌రిచింది. 'స‌మ్ థింగ్ స‌మ్ థింగ్' సినిమ త‌ర్వాత సిద్దు పూర్తిగా టాలీవుడ్ కి దూర‌మైమ‌ళ్లీ 'మ‌హాస‌ముద్రం'తోనే రీ ఎంట్రీ ఇచ్చాడు.

మ‌ధ్య‌లో కొన్ని హిందీ సినిమాలు కూడా చేసాడు. కానీ ఏవి అత‌న్ని టాలీవుడ్ అంత గొప్ప న‌టుడ్ని చేయ‌లేక‌పోయాయి. అప్పుడ‌ప్పుడు కొన్ని వివాదాస్ప‌ద కామెంట్ల‌తోనూ వార్త‌ల్లో నిలుస్తున్నాడు. ఈ మ‌ధ్య‌నే పాన్ ఇండియా సినిమాకి కొత్త అర్ధాన్ని చెప్పాడు. 'కేజీఎఫ్‌'..'బాహుబ‌లి'..'ఆర్ ఆర్ ఆర్' లాంటి సినిమాల్ని ఎక్క‌డా ప్ర‌స్తావించ‌కుండా మాతృభాష కోలీవుడ్ లో తెర‌కెక్కిన 'రోజా' సినిమా గురించి ఓ రేంజ్ లో క్లాస్ పీకాడు.

త‌మ‌ బాస్ మ‌ణిర‌త్నం 'రోజా' సినిమా అన్ని భాష‌ల ప్రేక్ష‌కులు చూసార‌ని..అది తొలి పాన్ ఇండియా సినిమాని అన్నాడు. అలా సిద్దార్ధ్ సొంత భాష త‌మిళంపై త‌న మ‌మ‌కారాన్ని చాటుకున్నాడు. ప్ర‌స్తుతం సిద్దార్ధ్ హిందీలో 'ఎస్కేప్ లైవ్' అనే వెబ్ సిరీస్లో న‌టిస్తున్నాడు. సైన్స్ పిక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ సిరీస్ డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది.

సిరీస్ ని ప్ర‌మోష‌న్ లో భాగంగా వివిధ రాష్ర్టాల్లో తిరుగుతున్నాడు సిద్దార్ధ్. అయితే ఓ ఈవెంట్ లో బాలీవుడ్ గురించి..త‌న నేటివిటీ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసాడు. ''నేను ఢిల్లీ అబ్బాయిన అని చాలా మంది మ‌ర్చిపోతున్నారు. నేను కూడా హిందీ మాట్లాడుతాను. భాష మీద మంచి ప‌ట్టుంది. కానీ న‌టుడిగా సౌత్ లో ఎక్కువ సినిమాలు చేసాను. డిఫ‌రెంట్ కంటెంట్ చిత్రాలేవైనా వ‌స్తే త‌ప్ప‌కుండా హిందీలో న‌టిస్తాను. అప్ప‌టి వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే'' అన్నారు.

దీంతో నెటి జ‌నులకు సిద్దార్ధ్ టార్గెట్ అయ్యాడు. ఇప్పుడు హిందీలో వెబ్ సిరీస్ చేసే స‌రికి ఉత్త‌రాది ప్రేక్ష‌కులు గుర్తొచ్చి బ‌ర్త్ ప్లేస్ ని కూడా మ‌ర్చిపోతాడా? అని మండిప‌డుతున్నారు. చైన్నైలో పుట్టిన సిద్దార్ధ్ ఢిల్లీ కుర్రాడు ఎలా అవుతాడో కాస్త క్లియ‌ర్ గా చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సౌత్ లో అవ‌కాశాలున్నంత కాలం సౌత్ పాత పాడిన హీరోగారు ఇప్పుడు హిందీ వాయిజ్యం అందుకున్నారా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. అలాగే హిందీలో అవ‌కాశాలు రాక‌పోయినా వ‌చ్చిన‌ట్లు తానే రిజెక్ట్ చేసిన‌ట్లు స్వ‌రం మార్చ‌డం వితంగా ఉందంటున్నారు. మ‌రి హీరోగారి లాజింట్ ఏంటో? ఆయ‌న‌కే తెలియాలి.