Begin typing your search above and press return to search.

చియాన్ వా.. రెమోవా.. ఏమిటిది రౌడీ గారూ?

By:  Tupaki Desk   |   31 Dec 2019 6:30 PM GMT
చియాన్ వా.. రెమోవా.. ఏమిటిది రౌడీ గారూ?
X
టాలీవుడ్ లో మోస్ట్ స్టైలిష్ హీరో ఎవ‌రు? అంటే అల్లు అర్జున్ గురించి చెబుతారు. స్టైలిష్ స్టార్ అన్న బిరుదు ఆయ‌న‌కు ఉంది. కానీ దేవ‌ర‌కొండ వ్య‌వ‌హారం చూస్తుంటే స్టైలిష్ ఐక‌న్ అన్న ప‌దానికే ప‌ర్యాయంలా క‌నిపిస్తున్నాడు. అప్పుడ‌ప్పుడు వెర్రెత్తించే పిచ్చి స్టైలింగ్ పై నెటిజ‌నులు ట్రోల్ చేస్తున్నా.. చాలా సంద‌ర్భాల్లో రౌడీ అనుస‌రిస్తున్న ఫ్యాష‌న్ కి ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. స్టైల్ ఐక‌న్ కి మ‌రో రూపంలా అత‌డు ఇస్తున్న ట్రీట్ మామూలుగా లేదు.

తాజాగా గోవాలో జ‌రుగుతున్న ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలింఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) ముగింపు ఉత్స‌వాల్లో దేవ‌ర‌కొండ ప్ర‌త్య‌క్ష‌మైన తీరు చూసి వేడుక‌ల్లో అంతా షాక్ తిన్నార‌ట‌. అదిరిపోయే వైట్ సూట్ లో దిగిన దేవ‌ర‌కొండ సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపించాడు. ఈ వేడుక‌లో షో స్టాప‌ర్ అత‌డే. స్టైలిష్ వైట్ సూట్ పై లైట్ గా క‌నిపిస్తున్న ఆ గ‌డి వ‌ల్ల.. ఆ బాట‌మ్ కి బ్యాగీ స్టైల్ వ‌ల్ల‌ ఎంతో స్మార్ట్ అప్పియ‌రెన్స్ వ‌చ్చింది. ఇక అత‌డి హెయిర్ స్టైల్.. బ్లాక్ గాగుల్స్ .. సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపించాయి. టాలీవుడ్ లో మ‌రో చియాన్ పుట్టుకొచ్చాడా? అన్నంత‌గా అత‌డి స్టైలింగ్ కుదిరింది.

గ‌త వారం రోజులుగా గోవాలో ఇఫీ ఉత్స‌వాల గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. నిన్న‌టితో వేడుక‌లు ముగిశాయి. ఇక రౌడీ తిరిగి వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటాడు. ఫిబ్ర‌వ‌రి 14న ల‌వ‌ర్స్ డే సంద‌ర్భంగా ఆరోజు రిలీజ్ కి ప్లాన్ చేస్తోంది చిత్ర‌బృందం. ఈ సినిమా త‌ర్వాత పూరి.. ఇంద్ర‌గంటి లాంటి ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేయ‌నున్నాడు.