Begin typing your search above and press return to search.

ఈ టాప్ టెన్ హీరో-హీరోయిన్ల గోలేంటిరా నాయనా?

By:  Tupaki Desk   |   16 Jan 2023 6:30 AM GMT
ఈ టాప్ టెన్ హీరో-హీరోయిన్ల గోలేంటిరా నాయనా?
X
గత కొన్నాళ్లుగా ఓరమాక్స్ అనే ఒక మీడియా సంస్థ ఎప్పటికప్పుడు తెలుగులో టాప్ టెన్ హీరోలు, తమిళంలో టాప్ టెన్ హీరోలు, తెలుగులో టాప్ టెన్ హీరోయిన్లు, తమిళంలో టాప్ టెన్ హీరోయిన్లు ఇలా రకరకాల లిస్టులు రిలీజ్ చేస్తూ వస్తోంది. ప్రతినెల టాప్ టెన్ హీరోలు వీరే టాప్ టెన్ హీరోయిన్లు వీరే, వీరి గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో, మీడియాలో చర్చ జరిగింది అంటూ లిస్టులు ప్రకటిస్తూ వస్తున్నారు.

తమను తాము ఇండియాలోనే ఒక స్పెషలిస్ట్ మీడియా కన్సల్టింగ్ సంస్థగా అభివర్ణించుకుంటున్న ఈ మీడియా సంస్థ సినిమా, టీవీ, ఓటీటీ, న్యూస్, మ్యూజిక్, స్పోర్ట్స్ వంటి అంశాలలో అనలిటిక్స్ ద్వారా ఎవరి గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది? టాప్ లో ఎవరున్నారు అనే విషయాలను చెబుతూ వస్తోంది. అయితే వీరు ప్రకటిస్తున్న జాబితాలు మాత్రం ఒక్కోసారి ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.

ముఖ్యంగా ఇటీవల కనుక మనం చూసుకుంటే పాన్ ఇండియా లెవెల్ లో టాప్ టెన్ హీరోలు ఎవరు? హీరోయిన్లు ఎవరు అంటూ రెండు లిస్టులు విడుదల చేసింది. అయితే ఇందులో హీరోల లిస్టు అనేక అనుమానాలకు తావిచ్చే విధంగా ఉంది. ఎందుకంటే ఇండియాలో మొట్టమొదటి పాన్ ఇండియా హీరో ఎవరు అనగానే మనం ముందుగా ప్రభాస్ అని అనుకుంటాం. కానీ వీళ్లు మాత్రం ప్రభాస్ ను రెండో స్థానానికి నెట్టి ఒక్క పాన్ ఇండియా మూవీ కూడా చేయని తలపతి విజయ్ కి మొదటి స్థానం కట్టబెట్టారు. విజయ్ తర్వాత ప్రభాస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత అక్షయ్ కుమార్, అల్లు అర్జున్, యష్, అజిత్ కుమార్, షారుక్ ఖాన్, రామ్ చరణ్, మహేష్ బాబు ఇలా పదిమంది హీరోలను ప్రకటించారు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి.

టాప్ టెన్ హీరోయిన్స్ అని చెబుతూ మొదటి స్థానం సమంతకు అప్పజెప్పి రెండవ స్థానంలో అలియా భట్ తర్వాత నయనతార, దీపికా పదుకొనే, కాజల్ అగర్వాల్, రష్మిక, కత్రినా కైఫ్, త్రిష, తమన్నా, కీర్తి సురేష్ వంటి వారిని ప్రకటించారు. అసలు ఏ ఆధారంగా వీరి సర్వేలు చేపట్టి లిస్టులు విడుదల చేస్తున్నారు అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు. ఫ్యాన్స్ అయితే ఈ సంస్థ హీరోల వద్ద హీరోయిన్ల వద్ద డబ్బులు తీసుకుని వాళ్ళకు అనుకూలంగా లిస్టు ప్రకటిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.

ఆ మధ్య సమంత కూడా కరణ్ జోహార్ ఇంటర్వ్యూలో నిజంగానే తన ఓరామాక్స్ మీడియా వాళ్లకి డబ్బులు ఇస్తున్నానని సరదాగా కామెంట్ చేయడంతో అసలు వాళ్ళ సంస్థ మీద, ఆ సంస్థ విశ్వసనీయత మీద అనుమానాలు రేకెత్తుతున్నాయి. మీకు ఏమనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.