Begin typing your search above and press return to search.
వయసుతో పనేముందు...కోట్లు వచ్చిపడుతుంటే?
By: Tupaki Desk | 8 Dec 2022 3:22 AM GMTవయసుతో పనేముందు కోట్ల రూపాయాలు వచ్చి పడుతుంటే? కోట్లు సంపాదించడానికి వయసు అడ్డంకిగా మారితో ఆలోచించాలి! లేకపోతే వయసైపోయిందని మూలన కూర్చుంటారా? వచ్చే డబ్బు చేదు అవసరం లేదని వదిలేసుకుంటారా? ఒంట్లో సత్తువ ఉన్నంత కాలం పనిచేసుకుంటూ వెళ్లిపోవడమే కష్టపడే వాడి లక్షణం. సరిగ్గా ఈఫార్ములాని నమ్ముకుని 60 ఏళ్లు దాటినా ఇంకా సినిమాలకు రిటైర్మెంట్ తీసుకోకుండా పనిచేస్తున్నారు.
రజనీకాంత్.. కమల్ హాసన్..చిరంజీవి... .బాలకృష్ణ ..నాగార్జున..అమితాబచ్చన్ ఇలా ఒకరేంటి పరిశ్రమలో చాలా మంది 60 ఏళ్లు నిండిన నటులున్నారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఇంకా తమ మ్యాజిక్ ని వర్కౌట్ చేస్తూనే ఉన్నారు. అదే లెగస్సీతో ఇంకా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నారు. 60 ఏళ్లు నిండాయని రిలాక్స్ అవ్వలేదు. అంతకు మించి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు.
మేటి హీరోలకు పోటీగా రంగంలోకి దిగుతున్నారు. చిరంజీవి అయితే ఏకంగా వాళ్లకు నేనే పెద్దపోటీ అంటూ సవాల్ సైతం విసిరి దూసుకుపోతున్నారు. ఇక వయసును దాంచేందుకు ఎవరి స్టైల్లో వారు ముందుకెళ్తున్నారు. ఉన్న సాంకేతను వినియోగించు కుని వీలైనంతగా తమ ఫేస్ వ్యాల్యూని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వాళ్లకి గ్లామర్ అవసరం లేదు.
ఇమేజ్ తోనే బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నారు. అయితే ఇక్కడే వీళ్లంతా ఓ లాజిక్ ని ఫాలో అవుతున్నారు. వయసుకు తగ్గ పాత్రల్ని ఎంపిక చేసుకోవడమే వాళ్ల సక్సెస్ కి ఓ రకమైన సీక్రెట్ గా చెప్పాలి. అక్కడ తేడా జరిగితే మొత్తం ఆర్డర్ మారిపోతుంది. ఆహార్యం పరంగానూ చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నారు. వయసుకు తగ్గట్టు ఆహార్యాన్ని డిజైన్ చేసుకుంటున్నారు.
ఈ విషయంలో అందరికంటే ముందే బాలయ్య అలెర్ట్ అయ్యారు. ఇక నాగార్జున..వెంకటేష్ లాంటి వారు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తమతో పాటు కథలు హైలైట్ అయ్యేలా చూసుకుంటున్నారు. ఈమధ్య కాలంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా మారారు. కథల పరంగా ఆయన ఆలోచనా విధానంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి.
'గాడ్ ఫాదర్' లో ఆ ఛేంజోవర్ కనిపించింది. అయితే ఇప్పుడు వాల్తేరు వీరయ్యగా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. కానీ వీరయ్య పాత్రలో చిరు వయసు హైలైట్ అవుతుంది. లుక్ పరంగా ఛేంజ్ తీసుకొచ్చినప్పటికీ వయసు ని మ్యానేజ్ చేయడం ఇబ్బంది కరంగానే అనిపిస్తుంది. ఇక కమల్ హాసన్..రజనీ కాంత్ లాంటి వారు ప్రోస్తెటిక్ మ్యాకప్ ల్ని ఎంపిక చేసుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.