Begin typing your search above and press return to search.
క్రిటిక్స్ పైనే దాస్ సవాల్! వ్వాట్!!
By: Tupaki Desk | 30 May 2019 2:30 PM GMTఈ శుక్రవారం(మే 31న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తున్నాడు దాస్. ఆడు ఫలక్ నుమా దాస్. ఎవ్వరినీ లెక్క చేయడు. పొడిచేస్తామన్నా ఖాతరు చేయడు. తేడాలొస్తే బొక్కలిరిగదీస్తడు. ట్రైలర్- టీజర్ తోనే అతడేంటో తెలిసిపోయింది. అయితే అదొక్కటేనా .. కొట్లాటలేనా? అంటే అంతే కాదు.. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కి కొదవేమీ ఉండదని ఫలక్ నుమా దాస్ హీరో కం దర్శకుడు విశ్వక్ తెలిపాడు. తాజా ఇంటర్వ్యూలో హైదరాబాద్ గురించి భలేగా చెప్పాడు దాసు. ఫ్రెండు కోసం ప్రాణమిచ్చే స్నేహితులు.. తేడాలొస్తే ఎవరికైనా బొక్కలిరగ్గొడతారని.. హైదరాబాద్ లో ఆతిధ్యం బావుంటుందని.. తినే ఫుడ్ అదిరిపోతుందని దాసు చెప్పాడు. ఫలక్ నుమా ప్యాలెస్ నే కాదు ఆ వెనక ఉన్న బస్తీని తెరపై చూడమన్నాడు.
విశ్వక్ మాట్లాడుతూ ``హైదరాబాద్ లో ఉన్న పాత్రలు ఉన్నట్టే అనిపించింది. ఇక్కడ కుర్రాళ్లు ఆప్యాయంగా ఉంటారు. తేడాలొస్తే బొక్కలిరగ్గొడతాడు. ఫుడ్ ఎంతో బావుంటుంది ఇక్కడ. మంచి మనుషులున్నారు. సినిమాలో ఇవే కాదు.. ఫ్యామిలీ అక్క చెల్లెళ్లు.. అన్నదమ్ములు అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ కష్టాలొచ్చినప్పుడు వెళ్లిపోరు. గుడ్ టైమ్ లోనే కాదు బ్యాడ్ టైమ్ లోనూ కలిసి ఉంటారు. ఆ రిలేషన్స్ అన్నీ ఉంటాయి. సెకండాఫ్ ఎమోషన్ పీక్స్`` అని చెప్పాడు.
ఏమాత్రం గ్యాప్ లేకుండా ఎంతో జోవియల్ గా మాట్లాడేస్తున్న దాస్ ని ఆపి తెలుగు సినీమీడియా- క్రిటిక్స్ ఓ ప్రశ్న కూడా అడిగారు. ఇందులో ఏంటి స్పెషల్? అంటే.. ``మీ మేధస్సు ఉపయోగించి నెక్ట్స్ ఏం జరుగుతోందో మీరు చెప్పలేరు. ఎందుకు గెస్ చేయలేరు అంటే రెగ్యులర్ ప్యాట్రన్ ఉండదు`` అని చెప్పాడు. తన సినిమా ఓ రెగ్యులర్ ప్యాట్రన్ ఉంటే గెస్ చేయొచ్చు. కానీ అస్సలు థియేటర్లలో చూసే జనం ఏమాత్రం ఊహించని విధంగా ఉంటుందని అన్నాడు. అంటే దాస్ సినిమా క్రిటిక్స్ కి కూడా ఓ పరీక్ష పెట్టబోతోందన్నమాట. నెక్ట్స్ ఏం జరగబోతోంది? ఏ సీన్ వస్తుంది? అన్నది ముందే ఊహించలేరు. అంత సర్ ప్రైజింగ్ గా థ్రిల్లింగ్ గా ఈ సినిమాని తీసాడో లేదో నేటి సాయంత్రం ప్రివ్యూల రిపోర్ట్ నుంచే తెలుస్తుందోమే. పొద్దున్నే క్రిటిక్స్ షోలో చూసి రివ్యూలే చెబుతాయిలే!!