Begin typing your search above and press return to search.

కథానాయకుడు సరే.. మహానాయకుడు సంగతి?

By:  Tupaki Desk   |   11 Jan 2019 12:37 PM GMT
కథానాయకుడు సరే.. మహానాయకుడు సంగతి?
X
ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా విడుదల చేస్తారనగానే మొదటి భాగం ఫ్లాట్ గా ఉండొచ్చని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కారణం ఏంటంటే. ఎన్టీఆర్ తన సినీ జీవితం ఆరంభించిన తొలినాళ్ళలో తప్ప అయనకు స్ట్రగుల్ లేదు.. హీరోగా కెరీర్ లో తిరుగే లేదు. ఇలా చాలామంది వ్యక్తం చేసిన అనుమానమే 'కథానాయకుడు' సినిమా విషయంలో నిజమైంది.

యువకుడి గెటప్ పక్కన బెడితే మిగతా గెటప్పులు అన్నిటిలోనూ బాలయ్య మెప్పించాడు. మొదటి భాగంలో చాలామంది నటులున్నప్పటికీ అందరినీ మించి ప్రేక్షకులను మెప్పించింది మాత్రం విద్యా బాలన్ నటనే. ఎన్టీఆర్ అన్ని గెటప్ లు కవర్ అయ్యాయి. అన్నీ సీన్లు ఉన్నాయి గానీ.. వేటికవే విడివిడిగా బాగున్నాయి. కానీ సినిమాలో మొదటి నుండి చివరివరకూ ఎమోషన్ క్యారీ అవలేదని కొందరి అభిప్రాయం. కుమారుడి మరణం లాంటి ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పటికీ అవన్నీ బిట్లు బిట్లు గానే వర్క్ అవుట్ అయ్యాయని అంటున్నారు. ఇదే మహానటి లో ఎమోషన్ మొదటి సీన్ నుండి చివరి సీన్ వరకూ క్యారీ అవుతుంది. 'కథానాయకుడు' లో ఇది పెద్ద లోటే.

ఇదిలా ఉంటే రెండో భాగం 'మహానాయకుడు' పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే లక్ష్మి పార్వతి ఎపిసోడ్ ఉండదని వార్తలు వచ్చాయి కాబట్టి ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని సగం సగం మాత్రమే ఎన్టీఆర్ టీమ్ సినిమాలో చూపిస్తున్నారనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఇక అధికారమార్పిడి ఉంటుందేమో గానీ వెన్నుపోటు అనే మాటే వినిపించదు. వీటన్నిటికి తోడు 'కథానాయకుడు' కు జరిగినట్టే 'మహానాయకుడు' లో కూడా ఎమోషన్ క్యారీ అవకపోతే టోటల్ గా ఎన్టీఆర్ బయోపిక్ పై విమర్శలు తప్పేలా లేవు.