Begin typing your search above and press return to search.

'ఆచార్య' విష‌యంలో త‌ప్పెవ‌రిది?..ఎక్క‌డ త‌ప్పు జ‌రిగింది?

By:  Tupaki Desk   |   2 May 2022 8:30 AM GMT
ఆచార్య విష‌యంలో త‌ప్పెవ‌రిది?..ఎక్క‌డ త‌ప్పు జ‌రిగింది?
X
మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలి సారి క‌లిసి న‌టించిన చిత్రం 'ఆచార్య‌' ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ శుక్ర‌వారం విడుద‌లైన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌తో పాటు అభిమానుల్ని కూడా తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. మిస్టేక్ చేసింది ఎవ‌రు? .. అస‌లు త‌ప్పెక్క‌డ‌ జ‌రిగింది? అన్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది. మిర్చి నుంచి భ‌ర‌త్ అనే నేను' చిత్రాల వ‌ర‌కు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ల‌ని అందించిన ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ వైపు ఇప్ప‌డు అంద‌రు వేలు చూపిస్తున్నారు. కార‌ణం ఆయ‌న చేసిన మిస్టేక్స్ వ‌ల్లే సినిమా పోయింద‌ని ర‌క ర‌కాల కామెంట్ లు వినిపిస్తున్నాయి.

కొర‌టాల చేసిన త‌ప్పిదాల వ‌ల్లే ఫ్యాన్స్‌, యాంటీ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో ఈ సినిమాని ఓ ఆట ఆడుకున్నార‌ని ప‌లువురు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ విషయం ప‌క్క‌న పెడితే కొర‌టాల శివ ద‌ర్శ‌కుడు కాక ముందు మంచి ర‌చ‌యిత. ఆయ‌న క‌థ‌, మాట‌లు అందించిన చాలా చిత్రాలు సూప‌ర్ హిట్ లుగా, బ్లాక్ బ‌స్ట‌ర్ లుగా నిలిచాయి. తాను ఎంచుకున్న క‌థ‌కు క‌మ‌ర్ష‌యిల్ అంశాల్ని జోడించి సామాజిక సందేశాన్ని అంత‌ర్లీనంగా అందించ‌డంతో కొర‌టాల శివ‌ది ప్ర‌త్యేక శైలి. అదే ఆయ‌న‌ని ద‌ర్శ‌కుడిగా మిర్చి నుంచి భ‌ర‌త్ అనే నేను వ‌ర‌కు స‌క్సెస్ బాట ప‌ట్టిస్తూ వ‌చ్చింది.

అయితే 'ఆచార్య‌' విష‌యంలో మాత్రం ఆయ‌న త‌ప్ప‌ట‌డుగు వేసిన‌ట్టుగా స్ప‌ష్ట‌మౌతోంది. ఓ క‌థ‌ని సామాజిక అంశాల్ని జోడించి క‌మ‌ర్ష‌యిల్ క‌థ‌గా చెప్ప‌డంతో స‌క్సెస్ అవుతూ వ‌స్తున్న కొర‌టాల అదే ఫార్ములాని స‌రిగా ఉప‌యోగించ‌క‌పోవ‌డం వ‌ల్లే 'ఆచార్య‌' విష‌యంలో అడ్డంగా బుక్క‌య్యాడ‌ని అంటున్నారు. మెగాస్టార్ తో సినిమా అని ప్ర‌క‌టించి ఆయ‌న సినిమాని కాస్తా చ‌ర‌ణ్ సినిమాగా మార్చ‌డం వ‌ల్లే ఈ 'ఆచార్య‌' విష‌యంలో బ్లండ‌ర్ మిస్టేక్ గా మారింది. ప్ర‌ధాన పాత్ర‌ని గెస్ట్ గా మార్చి .. గెస్ట్ పాత్ర‌ని ప్ర‌ధాన పాత్ర‌గా మ‌ల‌చ‌డం వ‌ల్లే కొర‌టాల శివ 'ఆచార్య‌' విష‌యంలో భారీ మూల్యం చెల్లించాల్సి వ‌చ్చింద‌న్న‌ది విశ్లేష‌కుల వాద‌న‌.

ట్రైల‌ర్ ని క‌ట్ చేసిన విధానంతోనే ప‌లు అనుమానాల‌కు తావిచ్చిన కొర‌టాల అక్క‌డి నుంచే మిస్టేక్ లు చేస్తూ వ‌చ్చార‌ని చెబుతున్నారు. ఇక స్వ‌త‌హాగా ర‌చ‌యిత అయిన కొర‌టాల సినిమాకు ప‌దునైన సంభాష‌ణ‌లు రాసుకోక‌పోవ‌డం మ‌రో మిస్టేక్ గా మారింది. ఇక ఫామ్ లో వున్న దేవిశ్రీ ప్ర‌సాద్ ని ప‌క్క‌న పెట్టి చిరు ప‌ట్టుబ‌ట్టిన మ‌ణిశ‌ర్మ‌ని ఫైన‌ల్ చేయ‌డం మ‌రో త‌ప్పుగా చెబుతున్నారు. నేప‌థ్య సంగీతం, పాటలు ఏ మాత్రం విన‌ద‌గ్గ‌వి లేవు. ఇక త‌న సినిమాల్లో బ‌ల‌మైన క‌థ‌ని ఎంచుకునే కొర‌టాల ఇద్ద‌రు స్టార్స్ వున్న సినిమా, పైగా మెగా ఫ్యామిలీకి ప్ర‌త్యేకంగా నిలిచిన చిత్రానికి పేల‌వ‌మైన క‌థ‌ని ఎంచుకోవ‌డం మ‌రో మిస్టేక్ గా మారింది.

చిరుపై, చ‌ర‌ణ్ పై చిత్రీక‌రించిన స‌న్నివేశాలు కూడా చాలా ఫేల‌వంగా వున్నాయ‌ని చెబుతున్నారు. ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ లైతే మ‌రీనూ. ఇద్ద‌రు స్టార్స్ తో సినిమా అంటే ఎటు చూసినా అభిమానుల‌కు రోమాంచిత ఘ‌ట్టాలు వుండాల్సిందే. కానీ అవేవీ ఇందులో క‌నిపించ‌లేదు. టెంపుల్ టౌన్ అంటూ అక్క‌డ అతి హింస‌, అత్యాచారాల‌ని చూపించిన తీరు కూడా ప్రేక్ష‌కుల‌కు అస‌హ‌నాన్ని క‌లిగించింది. మిర్చి నుంచి భ‌ర‌త్ అనే నేను వ‌ర‌కు హీరో ఎలివేష‌న్ స‌న్నివేశాలు ఓ రేంజ్ లో వుంటాయి. 'ఆచార్య‌'లో క‌నీసం చూద్దామ‌న్నా అలాంటి సీన్ ఒక్క‌టి కూడా లేదు.

హైరేంజ్ ఎలివేష‌న్స్ తో ఈ మ‌ధ్య వ‌చ్చిన ట్రిపుల్ ఆర్‌, కేజీఎఫ్ 2 ప్రేక్ష‌కుల‌కు రోమాంచిత అనుభూతిని క‌లిగించాయి. అలాంటి సినిమాలు చూసిన ప్రేక్ష‌కుల‌కు రొటీన్ స్ట‌ఫ్ తో ఇద్ద‌రు స్టార్స్ వున్నా ఎలాంటి ఎలివేష‌న్స్ లేకుండా సాఫీగా సాగే సినిమా ఎలా ఎక్కుతుంది. ఈ చిన్న లాజిక్ ని ఎలా మిస్స‌య్యార‌న్న‌ది అభిమానుల వాద‌న‌. బ్రిలియంట్ స్క్రిప్ట్ ల‌తో అప‌జ‌య‌మెరుగ‌ని ద‌ర్శ‌కుడిగా ముందుకు సాగుతున్న కొర‌టాల 'ఆచార్య‌' విష‌యంలో బ్లండ‌ర్స్ చేయ‌డం ఆయ‌న‌ని అభిమానించే వారికి ఏ మాత్రం రుచించ‌డం లేదు. ఇక‌నైనా ఎన్టీఆర్ సినిమాకు ఇలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటార‌ని, ఈ మూవీతో కొర‌టాల శివ మ‌ళ్లీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకోవాల‌ని అంతా ఆశిస్తున్నారు.