Begin typing your search above and press return to search.
మహేష్ తో ఎలాంటి సినిమా చేస్తాడో?
By: Tupaki Desk | 17 Aug 2022 6:36 AM GMTసూపర్ స్టార్ మహేష్-త్రివిక్రమ్ ముచ్చటగా మూడవసారి చేతులు కలుపుతోన్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ ఎంబీ 28వ చిత్రంగా దీన్ని సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. హాసిని-హారికా క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆలస్యమవుతుంది. అయితే ఈనెలలోనే సినిమా సెట్స్ కు వెళ్లే అవకాశాలున్నాయన్నది తాజా సమాచారం. ఈ లోపు ఇండస్ర్టీ సమస్యలన్ని ఓ కొలిక్కి వస్తాయని సన్నిహిత వర్గాల సమాచారం.
అసలు టాపిక్ చూస్తే? ఈ ద్వయం ఎలాంటి కథాంశంతో రాబోతున్నారు? అన్నదే ఇప్పుడు ఆసక్తికరం. ఇప్పటికే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అని ప్రచారం సాగుతోంది. ఆ కథని త్రివిక్రమ్ కమర్శియల్ టచప్ తో ఉండబోతుందని ఊహాఇగానాలు తెరపైకి వస్తున్నాయి. మాటల మాంత్రికుడు ఎలాంటి కథాశం తీసుకున్నా? అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలానే? తన సినిమాలు ఉంటాయి అన్నది ఇప్పటికే రుజువైంది.
ఎంత పెద్ద స్టార్ అయినా త్రివిక్రమ్ అంటే ఎమోషన్..ఫ్యామిలీ బాండింగ్స్ తప్పనిసరి అని చాలా సినిమాల్లో ప్రూవ్ చేసారు. మహేష్ తో చేసిన తొలి సినియా 'అతడు' సైతం అదే జానర్. 'ఖలేజా'లో మాత్రం ఓ కొత్త మహేష్ ని ఆవిష్కరించే ప్రయత్నంలో తడబడ్డాడు. మళ్లీ ఇప్పుడా తప్పటడుగు పునరావృతం కాకుండా చూసుకోవాలి. అలాగని మహేష్ తో రొటీన్ సినిమా చేస్తానంటే కుదరదు.
ఏదో ఒక యూనిక్ పాయింట్ తప్పనిసరి. 'సర్కారు వారి పాట' రొటీన్ సినిమా అయినా బ్యాంకుల దోపీడి తీరును హైలైట్ చేసారు. ఆ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఓ సందేశాన్ని పాస్ చేసారు. ఆ కథ మహేష్ యాక్సప్ట్ చేయడానికి ప్రధాన కారణం అదే. అయితే ఈ సినిమా ఓ సెక్షన్ ఆడియన్స్ కి అంతగా రుచించలేదు. రొటీన్ సినిమా? అనే కోవలోకి తోసేసారు.
కాబట్టి అలాంటి వాటి విషయంలో ఈసారి మహేష్ ముందు జాగ్రత్త పడటానికి చాన్స్ ఉంది. స్టోరీ జడ్జిమెంట్ పరంగా మహేష్ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. త్రివిక్రమ్ కథ విషయంలోనూ మహేష్ ఎన్నో రకాల మార్పులు చేయించినట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. పూరి కలం నుంచి జాలువారిన కథలో ఇలా మార్పులు జరగడం అన్నది చాలా రేర్.
పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ మాత్రమే ఇలాంటి మార్పులు కోరుతుంటారు. ఆ కోవలో మహేష్ నిలిచాడు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ ఎలాంటి కథలో మహేష్ ని ఆవిషర్కించబోతున్నాడు? అన్న ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో కనిపిస్తుంది. పైగా హీరోలంతా పాన్ ఇండియా మోజులో ఉన్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాతో అలాంటి ప్లానింగ్ ఏదైనా చేస్తున్నాడా? అన్నది మరో సందేహం.
ఇప్పటికే మహేష్ తో రాజమౌళిన్ పాన్ ఇండియా సినిమా కన్పమ్ అయింది. ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగే స్టోరీ ఇది. అంతటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ముందు మహేష్ హిట్ కంటెంట్ తో రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్లాలి. మరి మహేష్ లో ఉత్సాహం త్రివిక్రమ్ రెట్టింపు చేస్తాడా? లేదా? అన్నది చూడాలి.