Begin typing your search above and press return to search.
మొన్న రకుల్.. నిన్న అనుసూయ.. ఏం మెసేజ్ ఇస్తున్నట్లు..?
By: Tupaki Desk | 9 May 2019 11:27 AM GMTసోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకోవడం పరిపాటి అయిపోయింది. ఇందులో సెలెబ్రిటీల సంగతి అయితే ప్రత్యకంగా చెప్పనక్కర్లేదు. మామూలుగానే వారి జీవితాల్లోకి తొంగి చూసే రోజుల్లో సోషల్ మీడియాలో ఏదైనా పంచుకుంటే అది క్షణాల్లోనే వైరల్ అయిపోతుంది. మంచి విషయాలను పక్కనపెట్టి, అభ్యంతరకరమైన, అసభ్యకరమైన వాటిని మాత్రం నెటిజన్లు బాగా హైలైట్ చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సెలెబ్రిటీలు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది. కానీ, కొందరు సినీ ప్రముఖులు మాత్రం ఇలాంటివి ఏమీ పట్టించుకోవడం లేదు. తమకు ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతూ నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో మొన్న రకుల్ ప్రీత్ సింగ్, నిన్న అనుసూయ ఒకే లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
కొద్దిరోజుల కిందట కారు దిగుతూ ఉన్న ఫొటోను రకుల్ పోస్టు చేయడం సంచలనం అయింది. ఈ పిక్ లో ఆమె టాప్ మాత్రమే ధరించినట్లు కనిపించడంతో నెటిజన్లు షాక్ అయ్యారు. అంతేకాదు, ఆమెపై విమర్శల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే చాలా మంది ఆమె వాల్ లోకి వెళ్లి ఘోరమైన కామెంట్లు చేశారు. వీరిలో ఓ నెటిజన్ ఏకంగా రకుల్ ను బూతులు తిట్టాడు. దీంతో ఆమె సదరు వ్యక్తికి ఘాటు రిప్లై ఇచ్చింది. ‘‘నాకు తెలిసి మీ అమ్మ కూడా ఇలా కారులో చాలా సెషన్స్ లో పాల్గొని ఉంటుంది. అందుకే నీకు ఈ విషయాలు బాగా తెలిశాయి.! ఈ సెషన్ ల గురించి కాకుండా కొంచెం సంస్కారానికి సంబంధించిన విషయాలను కూడా నేర్పించమని మీ అమ్మని అడుగు. ఇలాంటి మనుషులు ఉన్నంత వరకు మహిళలకు రక్షణ ఉండదు. రక్షణ, సమానత్వం అంటూ చర్చలు సాగించడం వల్ల ఉపయోగం ఉండదు’’ అంటూ రాసుకొచ్చింది.
ఇక తాజాగా బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా పోస్టు చేసిన ఫొటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో తన భర్త కింద కూర్చుని ఉండగా, ఆమె కుర్చీలో ఉండి అతడికి మసాజ్ చేస్తోంది. మసాజ్ చేయడం పెద్ద విషయం కాకపోయినా.. ఆ ఫొటోలో ఆమె వేసుకున్న డ్రెస్ మాత్రం దారుణంగా ఉంది. ఈమె కూడా రకుల్ లా టాప్ ఒక్కటే వేసుకున్నట్లు ఈ ఫొటోలో కనిపించింది. ఈ ఫొటోలో అనసూయ థైస్ దర్శనమిస్తుండడంతో ఆమెపైనా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది బూతులతో కూడిన కామెంట్లు పెడుతున్నారు. ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.
వాస్తవానికి ఎవరి వ్యక్తిగత జీవితం వారిది.. ఎవరి ఇష్టాలు వారివి. కానీ, ఎవరికైనా కొన్ని పరిమితులు ఉంటాయి. వాటిని దాటితే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. కాబట్టి ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు ఏమైనా పోస్టులు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే మంచిది. తమకు నచ్చిన దానిని సమాజం అంగీకరిస్తుందా..? లేదా..? అన్నది కూడా ఆలోచించగలిగితేనే ఎక్కడైనా నెగ్గుకు రాగలం. అలా కాదని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ప్రవర్తిస్తే నవ్వుల పాలు అవుతారనడానికి ఈ రెండు పరిణామాలే ఉదాహరణగా చెప్పుకొవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో చెడును తీసుకున్నంత వేగంగా మంచిని తీసుకోవడం లేదన్నది ప్రతి ఒక్కరూ గ్రహించాలి.