Begin typing your search above and press return to search.
అక్కినేని హీరోలు నెక్ట్స్ ఏంటి?
By: Tupaki Desk | 23 Jan 2019 5:30 PM GMTఅక్కినేని హీరోలు 2019 ని క్లీన్ స్వీప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. 2018 ఓటమి భారంపై కసి తీర్చుకోవాలన్న పంతం కనిపిస్తోందిట. ఇప్పటికే కింగ్ నాగార్జున వరుసగా సినిమాల్లో నటించేందుకు సన్నాహకాల్లో ఉన్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వ ంలో బంగార్రాజు, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వ ంలో మన్మధుడు 2 చిత్రాల్ని సాధ్యమైనంత తొందరగానే ప్రారంభించేందుకు నాగార్జున సన్నాహకాల్లో ఉన్నారు. వారం రెండు వారాల గ్యాప్ లోనే ఈ రెండు చిత్రాల్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది.
నాగార్జున తరహాలోనే అక్కినేని నాగచైతన్య కెరీర్ పరంగా దూకుడు చూపించబోతున్నాడట. ప్రస్తుతం సమంత- చైతన్య జంటగా నటిస్తున్న మజిలీ నెలాఖరు నాటికి చిత్రీకరణ పూర్తి చేసుకుంటోందిట. సైమల్టేనియస్ గా నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈనెలాఖరు నాటికి కానీ వచ్చే నెల ప్రారంభంలో కానీ `వెంకీమామ` చిత్రీకరణకు చైతూ ఎటెండ్ అవుతాడని చెబుతున్నారు. దసరాకి ఈ సినిమాని రిలీజ్ చేయాలన్నది ప్లాన్. అలాగే పలువురు యువదర్శకులు చెప్పిన కథల్ని విన్నాడు చైతూ. ఈ ఏడాదిలోనే మరో రెండు చిత్రాలకు ఓకే చెప్పే అవకాశం ఉందన్న ముచ్చటా అక్కినేని కాంపౌండ్ లో సాగుతోంది.
ఈలోగానే అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం `మిస్టర్ మజ్ను` రిలీజైపోతోంది కాబట్టి అతడు కూడా తదుపరి ప్రాజెక్టులపై సీరియస్ గానే కసరత్తు చేస్తున్నాడట. ఇప్పటికే అఖిల్ కోసం అన్నపూర్ణ కాంపౌండ్ లో 20 పైగా స్క్రిప్టులు రెడీగా ఉన్నాయి. అయితే వాటి నుంచి ఫిల్టర్ చేసి స్క్రిప్టుల్ని ఫైనల్ చేయడమే తక్షణ కర్తవ్య ం అని కథ విషయంలో అఖిల్ ఏమాత్రం రాజీకి వచ్చేందుకు సిద్ధంగా లేడని అన్న పూర్ణ కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫిబ్రవరిలోనే రెండు సినిమాలకు సంబంధించిన వివరాలు ప్రకటిస్తానని నేటి ఇంటర్వ్యూలో అఖిల్ తెలిపారు. ఇప్పటికే అఖిల్ కోసం త్రివిక్రమ్, బోయపాటి వంటి దర్శకులు కథలు రెడీ చేశారన్న ప్రచారం ఉంది.