Begin typing your search above and press return to search.
దర్శకుడు చందూ మొండేటి నెక్స్ట్ ఏంటీ?
By: Tupaki Desk | 30 Nov 2022 11:30 PM GMTటాలీవుడ్ లో వున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో చందూ మొండేటి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన కమర్షియల్ ఎంటర్ టైనర్ లని అందిస్తూనే తన సినిమాల్లో ఏదో ఒక ప్రత్యేకత వుండేలా ప్లాన్ చేసుకుంటూ సక్సెస్ లని సొంతం చేసుకుంటున్నాడు. తొలి మూవీ మిస్టరీ థ్రిల్లర్ 'కార్తికేయ'తో మంచి హిట్ ని సొంతం చేసుకుని అందరిని ఆకట్టుకున్న చందూ మొండేటి తాజాగా అదే సినిమాకు సీక్వెల్ గా 'కార్తికేయ 2'ని తెరకెక్కించిన విషయం తెలిసిందే.
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ మూవీ చిన్న సినిమాగా విడుదలై పాన్ ఇండియా మూవీగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఆకట్టుకున్న ఈ సినిమాకు ఉత్తరాదిలో హిందీ వెర్షన్ కు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం విశేషం. టోటల్ గా ఐదు భాషల్లో కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టిన ఈ మూవీ కేవలం హిందీ మార్కెట్ లోనే రూ. 30 కోట్ల మేర వసూళ్లని రాబట్టి విస్మయపరిచింది.
నిఖిల్ బాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా ఈ మూవీ ఉత్తరాదిలో ఊహించని విధంగా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. దీంతో హీరో నిఖిల్ పాన్ ఇండియా స్టార్ ల జాబితాలో చేరిపోగా దర్శకుడు చందూ మొండేటి బాలీవుడ్ క్రేజీ స్టార్లకు హాట్ ఫేవరేట్ గా మారిపోయాడు.
క్రేజీ హీరోల నుంచి దర్శకుడు చందూ మొండేటికి భారీ ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. అంతే కాకుండా బాలీవుడ్ క్రేజీ హీరోలు హృతిక్ రోషన్ లేదా కార్తీక్ ఆర్యన్ లలో ఒక హీరోతో చందూ మొండేటి సినిమా చేసే అకాశం వుందని తెలుస్తోంది.
'కార్తికేయ 2' తరువాత గీతా ఆర్ట్స్ 2 చందూ మొండేటితో సినిమా చేయడానికి ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో చందూ మొండేటి నెక్స్ట్ ఏంటీ?.. ఎవరితో సినిమా చేయబోతున్నాడు.. ఈ ప్రాజెక్ట్ లో ఏ హీరో నటించబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా వుంటే 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న చందూ మొండేటితో ఆ స్థాయి మూవీకి గీతా ఆర్ట్స్ 2 శ్రీకారం చుట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. హృతిక్ రోషన్, కార్తీక్ ఆర్యన్ లకు పాన్ ఇండియా స్థాయి మార్కెట్ వుంది.
ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చందూ మొండేటితో గీతా ఆర్ట్స్ భారీ పాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక అప్ డేట్ ని త్వరలోనే గీతా ఆర్ట్స్ వర్గాలు వెల్లడించే అవకాశం వుందని తెలిసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.