Begin typing your search above and press return to search.

సాయిపల్లవి ఇప్పుడు ఏమంటుందో ?

By:  Tupaki Desk   |   1 Jun 2019 12:16 PM GMT
సాయిపల్లవి ఇప్పుడు ఏమంటుందో ?
X
తను కథల విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటానని ఏదిబడితే అది ఒప్పుకొనని చాలా నిక్కచ్చిగా చెప్పే సాయి పల్లవి క్రమక్రమంగా ఐరన్ లెగ్ గా మారుతోందని చెన్నై మీడియాలో జోరుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిన్న విడుదలైన ఎన్జికే చూశాక అసలు కథ విని ఓకే చేసిందా లేక సూర్య-శ్రీ రాఘవ కాంబినేషన్ కాబట్టి గుడ్డిగా సంతకం పెట్టేసిందా లాంటి విమర్శలు వినిపించాయి. కొత్త హీరోయిన్ అయినా కొంత వెనుకాడే అతి మాములు అనుమాన భార్య పాత్రను ఎంచుకున్న తీరు ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఇదే కాదు సాయి పల్లవి దీని వెనుక చేసిన సినిమాలు ఇంచుమించు ఇదే ఫలితాన్ని అందుకున్నాయి. ధనుష్ తో చేసిన మారి 2లో రౌడీ బేబీ పాట పాపులారిటీని ఇచ్చింది కానీ అది కూడా ఏమంత చెప్పుకోదగ్గ సినిమా కాదు. తెలుగులో వచ్చిన సంగతి కూడా ఎవరికి తెలియదు. ఇక గత ఏడాది చేసిన వాటిలో కణం చేదు ఫలితాన్ని ఇవ్వగా తెలుగులో చేసిన ఒకే స్ట్రెయిట్ మూవీ పడి పడి లేచే మనసు కూడా నిరాశపరిచే రిజల్ట్ నే ఇచ్చింది. మొత్తం కెరీర్ లో ప్రేమమ్-ఫిదా తప్ప సాయి పల్లవి గొప్పగా చెప్పుకునే హిట్స్ ఏమి లేవు.

ఇటీవలే మలయాళంలో అతిరన్ అనే మూవీ చేసింది అదీ గోవిందా కొట్టింది. ఒకరకంగా ఇదంతా తనను డిఫెన్స్ లో పడేసింది. వేణు ఊడుగుల దర్శకత్వంలో రానాతో చేయబోయే పొలిటికల్ థ్రిల్లర్ తప్ప సాయి పల్లవి ఇంకే కమిట్ మెంట్స్ ఇవ్వలేదు. ఆర్ ఆర్ ఆర్ కోసం సంప్రదింపులు జరుగుతున్నాయని టాక్ ఉంది ఖరారుగా తెలియదు. ఇకనైనా పాత్రల ఎంపికలో సాయి పల్లవి చాలా జాగ్రత్తగా ఉండకపోతే నష్టం ఇంకా పెరిగేలా ఉంది