Begin typing your search above and press return to search.
జెర్సీ యుఎస్ కలెక్షన్స్ ఏం చెబుతున్నాయి ?
By: Tupaki Desk | 19 April 2019 5:20 AM GMTఇవాళ న్యాచురల్ స్టార్ నాని జెర్సీ థియేటర్లలోకి అడుగు పెట్టింది. మంచి ఫీల్ గుడ్ ఎమోషన్ ఉన్న స్పోర్ట్స్ మూవీగా ట్రైలర్ నుంచి ఓ మాదిరి అంచనాలు రేపిన జెర్సీ యుఎస్ ప్రీమియర్లు నిన్న నుంచే మొదలుపెట్టుకుంది. ప్రాధమికంగా అందిన సమాచారం మేరకు నిన్న సాయంత్రం 7 గంటల వరకు 112 లొకేషన్లలో వేసిన షోల నుంచి 105000 డాలర్లు వసూలైనట్టుగా తెలిసింది. అంటే సగటున చూసుకుంటే ఒక్కో లొకేషన్ నుంచి వచ్చిన మొత్తం 940 డాలర్లు తేలుతుంది.
ఇది బేసిక్ రిపోర్ట్ కాబట్టి ఖచ్చితంగా ఇదే అని చెప్పలేం కానీ మొత్తానికి నాని సినిమాకు న్యాచురల్ స్టార్ ఇమేజ్ కు తగ్గ బ్రహ్మాండమైన ఓపెనింగ్ జెర్సీ కి దక్కేలేదేమో అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఇవాళ సాయంత్రానికి కొంత క్లారిటీ రావొచ్చు. ఇప్పుడు జెర్సీ భవితవ్యం మౌత్ టాక్ మీదే ఆధారపడి ఉంది. యుఎస్ లో ఎంత రన్ వస్తుంది ఎలాంటి ఫిగర్స్ నమోదవుతాయి అనేది అక్కడి నాని మార్కెట్ ని డిసైడ్ చేయబోతోంది.
భలే భలే మగాడివోయ్ నిన్ను కోరి తప్ప నాని బలంగా ప్రభావం చూపించిన సినిమా మరొకటి లేదు. దానికి తోడు ఎంత ఎమోషన్ ఉన్నా దానికి సమతూకంగా ఎంటర్ టైన్మెంట్ ఉంటేనే ఇష్టపడే యుఎస్ ప్రేక్షకులకు కేవలం సెంటిమెంట్ మీద ఎక్కువ ఆధారపడిన జెర్సీ ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఫస్ట్ డే కలెక్షన్ తో పాటు వీకెండ్ ఫిగర్స్ చూసాక ఒక కంక్లూజన్ కు రావొచ్చు