Begin typing your search above and press return to search.

పెళ్లి తర్వాత కొత్త పేరు ఏమ‌ని పిల‌వాలి?

By:  Tupaki Desk   |   19 Nov 2021 6:32 AM GMT
పెళ్లి తర్వాత కొత్త పేరు ఏమ‌ని పిల‌వాలి?
X
ఇన్నాళ్లు ఆ ఇద్ద‌రి ఎఫైర్ ఒక ర‌హ‌స్యం. దానిపై లీకులు త‌ప్ప అధికారిక ప్ర‌క‌ట‌న లేనే లేదు. పెళ్లెప్పుడు? అని ప్ర‌శ్నిస్తే.. అస‌లు మా మ‌ధ్య ఎఫైర్ అనేదే లేదు! అనేశారు. కానీ ఇంత‌లోనే అంతా మారుతోంది. ఇప్పుడు పెళ్లికి చ‌క‌చ‌కా ఏర్పాట్లు సాగిపోతున్నాయ‌న్న‌ మ‌రో పుకార్ మొద‌లైంది. ఇది నిజ‌మా? అబ‌ద్ధ‌మా? అన్న‌ది నెటిజ‌నులే తేల్చాలి.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రిన కైఫ్ తన ప్రియుడు.. ప్రముఖ హీరో విక్కీ కౌశల్ ని డిసెంబర్ లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోనుంది. ఈ స్టార్ క‌పుల్ దీపావళినాడు సన్నిహిత బంధువుల స‌మ‌క్షంలో నిశ్చితార్థం చేసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. తాజా వార్తల ప్రకారం.. కత్రినా తన పెళ్లి తర్వాత పేరు మార్చుకోనుంది. తన త‌దుప‌రి స్పై థ్రిల్లర్ టైగర్ 3 మేకర్స్ కి క్రెడిట్స్ లో కత్రిన కౌశల్ అని వేయాల‌ని తెలియజేసింది.

ప్ర‌స్తుతం ఈ జంట పెళ్లి ప‌నులు మొద‌ల‌య్యాయి. విక్కీ కౌశల్ కి చెందిన‌ 10 మంది సభ్యుల బృందం వివాహ ఏర్పాట్లను ప్లాన్ చేయడానికి సవాయి మాదాపూర్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాకు బయలుదేరింది. విక్కీ - కత్రినా ఇటీవల జుహులో ఒక అధునాత‌న సౌక‌ర్యాల‌తో ఉన్న‌ ఫ్లాట్ ను కొనుగోలు చేశారు. విరాట్ కోహ్లీ -అనుష్క శర్మ జంట ఫ్లాట్ కు పొరుగున ఈ ఫ్లాట్ ఉంది. ఇదే చోట ప‌లువురు టాప్ సెల‌బ్రిటీల‌కు సొంత అపార్ట్ మెంట్లు ఉన్నాయి. ఇంత‌కీ పెళ్లి త‌ర్వాత క‌త్రిన‌ను ఏమ‌ని పిల‌వాలి? అన్న ఫ‌జిల్ వీడిన‌ట్టేనా? క‌త్రిన కౌశ‌ల్ అని పిలిస్తే బావుంది క‌దూ? `కే` బ్రాండ్ (అక్ష‌రం)తో ఇప్ప‌టికే క‌త్రిన వ్యాపారాలు నిర్వ‌హిస్తోంది. ఇప్పుడు డ‌బుల్ కే (కేకే)తో ఒక రేంజులో దూసుకెళుతుందేమో!