Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఏం పాపం చేశారు జక్కన్న?

By:  Tupaki Desk   |   22 April 2022 11:30 PM GMT
ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఏం పాపం చేశారు జక్కన్న?
X
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి గత నెల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ ఆర్‌ ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డ్‌ బ్రేకింగ్ వసూళ్లను నమోదు చేసింది. కేజీఎఫ్‌ 2 సినిమా విడుదల తర్వాత జక్కన్న ఆర్‌ ఆర్ ఆర్ సినిమా వసూళ్ల విషయంలో కాస్త సైలెంట్‌ అయినా కూడా లాంగ్‌ రన్ లో మంచి వసూళ్ల ను నమోదు చేయడంలో సఫలం అయింది.

సినిమా విడుదల అయ్యి నెల రోజులు కావస్తున్నా కూడా ఇద్దరు హీరోల అభిమానులు సోషల్‌ మీడియాలో ఒకరి పై ఒకరు అన్నట్లుగా విమర్శలు చేసుకుంటూ పుకార్లు పుట్టిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో రాజమౌళి పై కోపంతో మేం ఏం పాపం చేశాం జక్కన్న అంటూ ఆవేదనతో కూడిన పోస్ట్‌ లు పెడుతున్నారు. అసలు విషయం ఏంటీ అంటే ఇటీవల ఆర్ ఆర్ ఆర్‌ సినిమాలో నటించిన ఒక నటుడు చేసిన వ్యాఖ్యలు.

ఆ వ్యాఖ్యలు ఏంటి అంటే... తారక్‌ ను చరణ్‌ కట్టేసి కొట్టిన తర్వాత జైల్లో వేస్తారు. ఆ సమయంలో ఒక అద్బుతమైన సన్నివేశం ఎన్టీఆర్‌ కు ఉంటుంది. ఆ సన్నివేశం ను ఎడిటింగ్‌ లో లేపాశారు. ఆ సన్నివేశం కనుక పడి ఉంటే ఎన్టీఆర్ స్టామినా ఏంటో మరింతగా ప్రతి ఒక్కరికి తెలిసేది అన్నాడట. ఆయన వ్యాఖ్యలు పట్టుకుని ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఎన్టీఆర్‌ అభిమానులు రచ్చ చేయడం మొదలు పెట్టారు.

ఇప్పటికే ఎన్టీఆర్‌ కు సినిమాలో సరిపడ ఎలివేషన్ సన్నివేశాలు పడలేదు. ఇలాంటి సమయంలో ఉన్న సన్నివేశాలను ఎడిటింగ్ లో లేపాల్సిన అవసరం ఏంటీ అంటూ రాజమౌళిని ఎన్టీఆర్‌ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. రాజమౌళి కి ఎన్టీఆర్‌ అంటే అత్యంత సన్నిహిత్యం. ఇద్దరి మద్య చాలా మంచి అనుబంధం ఉంది. అనుబంధంతో ఎన్టీఆర్‌ ఏమనుకోడు అనే ఉద్దేశ్యంతో ఎలివేషన్స్ తగ్గించావా జక్కన్న అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ఎన్టీఆర్‌ అభిమానులు చేస్తున్న రచ్చకు జక్కన్న ఫ్యాన్స్‌ మరియు చరణ్ అభిమానులు కూడా స్పందిస్తున్నారు. ఎన్టీఆర్‌ అభిమానుల ఆరోపణలు సరి కాదని వారు అంటున్నారు.

చరణ్ మరియు ఎన్టీఆర్‌ లకు ఇద్దరికి సమానమైన ఎలివేషన్స్ మరియు స్క్రీన్ టైమ్‌ ను రాజమౌళి ఇచ్చాడు. కనుక ప్రతి విషయాన్ని కూడా పెద్దది చేసి చూసి గొడవ చేయడం తగదు అన్నట్లుగా సోషల్‌ మీడియాలో కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.