Begin typing your search above and press return to search.

#రకుల్ టిప్స్.. జిమ్ చేశాక తాగాల్సిన పానీయం?

By:  Tupaki Desk   |   24 May 2021 11:30 AM GMT
#రకుల్ టిప్స్.. జిమ్ చేశాక తాగాల్సిన పానీయం?
X
టాలీవుడ్ అగ్ర క‌థానాయిక ర‌కుల్ ప్రీత్ ఫిట్నెస్ ఫ్రీక్ అన్న సంగ‌తి తెలిసిందే. రెగ్యుల‌ర్ జిమ్ యోగాని ఎప్పుడూ మిస్ చేయ‌దు. ఇక ఫిట్నెస్ పై ర‌కుల్ ఆన్ లైన్ క్లాసుల గురించి తెలిసిందే. ఇంత‌కుముందు ఉపాస‌న తో క‌లిసి ఫిట్నెస్ టిప్స్ పై చాలా ఆస‌క్తిక‌ర విష‌యాల్ని ముచ్చ‌టించిన ర‌కుల్ తాజాగా ఆరోగ్యకరమైన పోస్ట్-వర్కౌట్ పానీయం రెసిపీతో తన ఫిట్నెస్ రహస్యాన్ని వెల్లడించారు.

బాలీవుడ్ లోని ఫిట్ నెస్ ఫ్రీక్స్ కి ర‌కుల్ కాంపిటీట‌ర్ గా మారుతోంది. ఫిట్ నెస్ క్లాసుల కోసం నగరంలో క్రమం తప్పకుండా పాప్ అవుట్ అవుతోంది. తన వ్యాయామ సెష‌న్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలతో ప్రధాన ఫిట్నెస్ లక్ష్యాలను నిర్ధేశిస్తోంది.

తాజాగా తన శరీరాన్ని చక్కగా తీర్చిదిద్దే రహస్యాన్ని ఇటీవల పంచుకుంది. ఆమె తన ఇన్ స్టాలో పోస్ట్-వర్కౌట్ సెల్ఫీని పంచుకుంది. అక్కడ ఆమె పింక్ ట్యాంక్ టాప్ లో ప్రకాశవంతంగా కనబడుతోంది.నా పోస్ట్-వర్కౌట్ డ్రింక్ ఐసోలేట్-ప్రోటీన్.. అరటి- పిండి పదార్థాలు.. అవిసె గింజ ఫైబర్.. దాల్చినచెక్క యాంటీ ఆక్సిడెంట్లు.. జాజికాయ యాంటీ ఇన్ ఫ్ల‌మేటరీ ప‌దార్థాల‌ను ఉప‌యోగిస్తుందిట‌.

``మనలో చాలా మంది బియ్యం కొవ్వుగా ఉందని అనుకుంటున్నారు! కానీ దీనికి విరుద్ధంగా రైస్ శరీరానికి మంచిది. సులువుగా జీర్ణం కావడానికి పిండి పదార్థాల సులభ రూపమిది. ఇది గట్ ను నయం చేస్తుంది. ఇది పోషకాలను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఇది ప్రాథమిక ఆహారం .. లాక్ డౌన్ సమయంలో కూడా సులభంగా లభిస్తుంది. కాబట్టి సరళమైన పోష‌కాల‌తో సమతుల్య భోజనం తినాలి. మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకోవాలి.. అని తెలిపింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. రకుల్ తదుపరి 'మేడే'- 'డాక్టర్ జి'- 'థాంక్స్ గాడ్' 'ఎటాక్' లలో కనిపించనున్నారు. వైష్ణ‌వ్ తేజ్ స‌రస‌న కొండ‌పొలం చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. క్రిష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.