Begin typing your search above and press return to search.
ఈ వారం ఓటీటీలో ఏది బెస్ట్?
By: Tupaki Desk | 3 Sep 2022 9:30 AM GMTకరోనా కారణంగా సినీ ప్రియులు రికార్డు స్థాయిలో ఓటీటీలకు ఎడిక్ట్ అయిపోయారు. దీంతో వీకెండ్ వచ్చే సరికి ఏ ఓటీటీలో ఏ సినిమా స్ట్రీమింగ్ కాబోతోందనే సెర్చింగ్ ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైపోతోంది. దీంతో ఓటీటీలు కూడా సినీ ప్రియుల కోసం కొత్త కొత్త కంటెంట్ ని అందించడానికి రెడీ అయిపోతూ ఎవ్రీ వీక్ వీవర్స్ ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి. ఈ రేసులో ప్రముఖ ఓటీటీ దిగ్గజాలు అమెజాన్ ప్రైమ్... నెట్ ఫ్లిక్స్, జీ5 ముందునిలుస్తున్నాయి.
ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన రీమేక్ థ్రిల్లర్ 'కట్ పుత్లీ' స్ట్రీమింగ్ కాబోతోంది. రంజిత్ ఎమ్. తివారి దర్శకత్వం వహించాడు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన సైకలాజికల్ థ్రిల్లర్ 'రాట్ససన్' ఆధారంగా ఈ మూవీని రీమేక్ చేశారు. వాషు భగ్నాని, జాక్కీ భగ్నానీ, దీపశిఖా దేశ్ ముఖ్ సంయుక్తంగా ఈ రీమేక్ ని నిర్మించారు.
రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ థ్రిల్లర్ లని మించి హిందీ రీమేక్ ని తెరకెక్కించారు. అయితే దీనికి పెద్దగా బజ్ లేదు. సమీక్షలు కూడా ఆశించిన స్థాయిలో రాకపోవడంతో అక్షయ్ కి ఇక్కడ కూడా భారీ ఝలక్ తగలడం ఖాయం అని చెబుతున్నారు. ఇక ఈ మూవీతో పాటు తెలుగు మూవీ 'వాంటెడ్ పండుగాడ్' 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది.
సునీల్, సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఆగస్టులో థియేటర్లలోకి వచ్చింది. కానీ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఇక ఈ మూవీస్ తో పాటు కన్నడ మూవీ 'విక్రాంత్ రోణ' కన్నడ వెర్షన్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. కిచ్చా సుదీప్ హీరోగా పాన్ ఇండియా మూవీగా విడుదలై ఫరవాలేదనిపించింది. వసూళ్ల పరంగా కూడా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. కన్నడ నుంచి 'కేజీఎఫ్ 2' తరువాత విడుదలైన ఈ మూవీ తెలుగు వెర్షన్ డిస్నీప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 16 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.
ఇదే లైన్ లో ఓటీటీలోకి వచ్చిన మూవీ 'సుందరీ గార్డెన్'. మలయాళంలో తెరకెక్కిన ఈ మూవీకి చార్లీ డేవిస్ దర్శకత్వం వహించాడు. సూర్య నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఆకాశం నీ హద్దురా'తో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న అపర్ణ బాలమురళి టైటిల్ పాత్రలో నటించింది. సెప్టెంబర్ 2 నుంచి ఈ మూవీ సోనీలీవ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మధ్య కాలంలో మలయాళంలో ఈ మధ్య విడుదలైన సినిమాల్లో అత్యంత మంచి సినిమాగా విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకుంది.
మంచి టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం సోనీలీవ్ లో దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. ఈ వారం ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో చూడదగ్గ ఏకైక సినిమాగా ఈ మూవీని చెబుతున్నారు. ఇక ఈ మూవీతో పాటు బండ్లన్న.. బండ్ల గణేష్ నటించిన 'డేగల బాబ్జీ' ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంలో పార్తీబర్ హీరోగా ప్రయోగాత్మకంగా తెరకెక్కిన సినిమా కు రీమేక్ గా రూపొందిన 'డేగల బాబ్జీ' థియేటర్లలో విడుదలై డిజాస్టర్ అనిపించుకుంది. ఓటీటీలో ఈ మూవీని ఆదరిస్తారంటే కష్టమే అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.