Begin typing your search above and press return to search.
'పుష్ప' లో శ్రీవల్లి ఫస్ట్ లుక్ కి ప్రేరణ అదేనా..?
By: Tupaki Desk | 10 Oct 2021 2:30 AM GMTఅల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''పుష్ప''. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రీవల్లి అనే గ్రామీణ యువతి పాత్రలో లక్కీ బ్యూటీ కనిపించనుంది. ఇటీవల రిలీజ్ చేసిన ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
'పుష్ప' ఫస్ట్ లుక్ లో రష్మిక ఇంతకముందు ఎన్నడూ కనిపించని విధంగా డీ గ్లామర్ లో అందరినీ ఆశ్చర్య పరిచింది. పసుపు చీర ధరించి అద్దం ముందు కూర్చొని చెవులకు దిద్దులు.. మల్లెపూలు పెట్టుకుంటున్న అమ్మడి రా అండ్ రస్టిక్ లుక్ ఆకట్టుకుంది. అయితే సుకుమార్ ఈ ఫస్ట్ లుక్ కోసం లెజెండరీ చిత్రకారుడు, దివంగత ఎస్. ఇళయరాజా ఫేమస్ పెయింటింగ్స్ నుండి ప్రేరణ పొందారని ఇన్సైడ్ టాక్.
ప్రముఖ చిత్రకారుడు ఇళయరాజా ఏది పెయింట్ చేసినా అది ఒక ఛాయాచిత్రం వలె కనిపిస్తుంది. లైటింగ్ నమూనాలో పెయింటింగ్స్ వేయడంలో ప్రత్యేకత చాటుకున్న ఆయన.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. పెయింటర్ ఇళయరాజా గతేడాది కరోనా కారణంగా తుది శ్వాస విడిచారు. అయితే దివంగత కళాకారుడి పెయింటింగ్స్ లో ఒకదాని నుండి సుకుమార్ ప్రేరణ పొందారని అంటున్నారు.
ఇందులో నిజమెంతో తెలియదు కానీ రష్మిక గా శ్రీవల్లి లుక్ కి విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో రష్మిక దీనిపై స్పందిస్తూ నటిగా తనలోని విభిన్న కోణాలను అన్వేషించే అవకాశం తనకు లభించిందని సంతోషం వ్యక్తం చేసింది. 'పుష్ప లో నా ఫస్ట్ లుక్ కు హృదయపూర్వక అభినందనలు అందుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను మొదట భయపడ్డాను. కానీ ఇప్పుడు ప్రేక్షకుల ప్రశంసల పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు' అని రష్మిక అన్నారు.
ఇంకా రష్మిక మాట్లాడుతూ.. ఇది నా ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. నటిగా నాలోని విభిన్న కోణాలను అన్వేషించడానికి ఇది నాకు అవకాశాన్ని ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. ఇది మరో మైలురాయిని చేరుకోడానికి నాకు సహాయం చేస్తుంది. శ్రీవల్లి పాత్రను చూడడానికి అందరూ వేచి ఉండండి అని చెప్పుకొచ్చింది. రష్మిక 'పుష్ప' తో పాటుగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా చేస్తోంది. అలానే మరో రెండు బాలీవుడ్ చిత్రాలు అమ్మడి లైన్ లో ఉన్నాయి. సిద్ధార్థ్ మల్హోత్రాతో 'మిషన్ మజ్ను' మరియు అమితాబ్ బచ్చన్ తో కలిసి 'గుడ్ బై' చిత్రాల్లో రష్మిక నటిస్తోంది. వీటిలో 'పుష్ప' సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 17న విడుదల కానుంది.