Begin typing your search above and press return to search.
సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు అసలు కారణమేంటి? గగుర్పాటుకు గురి చేసే ప్రమాద సీసీ ఫుటేజ్
By: Tupaki Desk | 11 Sep 2021 3:01 AM GMTవినాయకచవితి పండుగ రోజున..ఊహించని రీతిలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం అందరిని షాక్ కు గురి చేసింది. స్పోర్ట్స్ బైక్ మీద వెళుతున్న మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మాదాపూర్ రోడ్డులో యాక్సిడెంట్ కు గురి కావటం.. తీవ్రంగా గాయపడటం తెలిసిందే. తొలుత మెడికవర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ను మాదాపూర్ పోలీసులు విడుదల చేశారు.
ఇందులో తేజ్ రోడ్డు ప్రమాదం ఎంత తీవ్రమైనదన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. వేగంగా బైక్ మీద వస్తున్న సాయి ధరమ్ తేజ్ బైక్.. తన ముందున్న బైక్.. ఆటోను ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వేగంగా వెళుతున్న ఆయన బైక్ ను వంపుగా తిప్పటం.. ముందు చక్రం స్కిడ్ కావటంతో బండి బ్యాలెన్స్ తప్పింది. కేవలం రెండు సెకన్ల వ్యవధిలో ఆయన బైక్ పట్టుతప్పి కిందకు పడటం.. వేగంగా వెళుతున్న బైక్.. ఆయన్ను కొంత దూరం మేర ఈడ్చుకెళ్లింది.
ఆ సందర్భంలో ఆయన తలకు ఉన్న హెల్మెట్ ఎగిరిపోయింది. లక్కీగా తలకు గాయాలు తగల్లేదు. దీంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పాలి. కానీ.. కాలి వేలికి బలమైన గాయంతో పాటు.. ఛాతీ మీద మొత్తం మూడు పెద్ద దెబ్బలు తగిలాయి. ప్రమాదం జరిగినంతనే.. షాక్ కు గురైన నేపథ్యంలో అపస్మారక స్థితిలోకి జారుకున్నారు. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసేలా ఉన్న ఈ బైక్ యాక్సిడెంట్ చూసిన తర్వాత.. మన రోడ్లు అతి వేగానికి ఏ మాత్రం సూట్ అయ్యేలా డిజైన్ చేయలేదన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.