Begin typing your search above and press return to search.

మ‌ణి స‌ర్ PS1.. అమ‌లాపాల్ వ‌దులుకోడానికి కార‌ణం?

By:  Tupaki Desk   |   13 Sep 2022 5:30 AM GMT
మ‌ణి స‌ర్ PS1.. అమ‌లాపాల్ వ‌దులుకోడానికి కార‌ణం?
X
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వన్ (PS1) 2022 మోస్ట్ అవైటెడ్ మూవీగా ప్ర‌చారంలో ఉన్న‌ సంగ‌తి తెలిసిందే. ఇందులో చియాన్ విక్ర‌మ్- ఐశ్వ‌ర్యారాయ్- జ‌యం ర‌వి-త్రిష‌ లాంటి దిగ్గ‌జ తార‌లు న‌టించడంతో ఉత్కంఠ నెల‌కొంది. అయితే ఇలాంటి క్రేజీ మూవీలో న‌టించే అవ‌కాశం ద‌క్కినా అమ‌లాపాల్ కాద‌నుకుందిట‌.

PS1లో భాగం కావడానికి తాను ఎందుకు నిరాకరించిందో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమలా పాల్ వెల్లడించింది. ఈ చిత్రం కోసం మొదట ఆడిషన్ చేసినప్పుడు తాను మాన‌సికంగా సిద్ధంగా లేన‌ని వెల్లడించింది. 2021లో మణిరత్నం ఆమెకు ఫోన్ చేసి ప్రాజెక్ట్ లో నటించమని ఆఫర్ చేసినప్పుడు త‌న మాన‌సిక ప‌రిస్థితి వేరుగా ఉంద‌ని ... అప్ప‌టికి సినిమా చేసే మానసిక స్థితిలో లేనందున ఇందులో నటించడానికి నిరాకరించాన‌ని తెలిపింది.

అమలా పాల్ మాట్లాడుతూ-"అలా ఎందుకు జరిగిందంటే చెప్పుకోద‌గ్గ కార‌ణ‌మే ఉంది. మణిరత్నం సార్ నన్ను పొన్నియన్ సెల్వన్ కోసం ఆడిషన్ చేసారు. నేను దాని కోసం చాలా ఎగ్జైట్ అయ్యాను. నేను మణి సర్ కి వీరాభిమానిని. చాలా ఉత్సాహంగా ఉన్నాను. కానీ ఆ సమయంలో అలా జరగలేదు. నేను చాలా నిరాశకు గురయ్యాను" అని తెలిపింది.

2021లో మ‌ణి స‌ర్ నన్ను పిలిచారు. నేను స‌రైన‌ మానసిక స్థితిలో లేను కాబట్టి తిరస్కరించవలసి వచ్చిందని తెలిపింది. అలా చేసినందుకు చింతిస్తున్నారా? అని నన్ను అడిగితే అలాంటిదేమీ లేద‌ని అంటాను. ఎందుకంటే అప్ప‌టికి కొన్ని విషయాలు పరిపూర్ణంగా ఉన్నాయి. ఇదే నా విధి! అని కూడా తాత్వికంగా మాట్లాడింది.

పీరియాడికల్ డ్రామా పీఎస్ 1 ప్ర‌ముఖ ర‌చ‌యిత‌ కల్కి కృష్ణమూర్తి రాసిన‌ చారిత్రాత్మ‌క‌ నవల పొన్నియిన్ సెల్వన్ (ది సన్ ఆఫ్ పొన్ని) ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ బచ్చన్- విక్రమ్- కార్తీ- జయంరవి- త్రిష- ఐశ్వర్య లక్ష్మి- విక్రమ్ ప్రభు- జయరామ్ - శోభితా ధూళిపాళ వంటి తారాగ‌ణం న‌టించారు.

లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ భారీ పాన్ ఇండియా చిత్రం మొదటి భాగం ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 న ఐదు భాషలలో విడుద‌ల కానుంది. తమిళం- హిందీ- తెలుగు- మలయాళం- కన్నడ భాషలలో థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హృతిక్ రోషన్ - సైఫ్ అలీ ఖాన్ ల విక్రమ్ వేదతో ఢీకొంటుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.