Begin typing your search above and press return to search.
సడెన్ గా దీపిక ఆస్పత్రిలో చేరడానికి కారణం?
By: Tupaki Desk | 28 Sep 2022 3:58 AM GMTబాలీవుడ్ అగ్ర కథానాయిక దీపిక పదుకొనే ఆసుపత్రిలో అనేక పరీక్షలు చేయించుకుంది. దీనికోసం దాదాపు హాఫ్ డే పట్టింది. ముందు రోజు నటి చాలా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొందని సమాచారం. దీంతో వెంటనే నగరంలో ఆసుపత్రిలో చేరింది. ఈ వార్తలను ఇప్పటివరకూ దీపిక బృందం అధికారికంగా ధృవీకరించలేదు. తాజా సమాచారం మేరకు.. దీపిక ఇప్పుడు బాగానే ఉందని తెలుస్తోంది.
కొన్ని నెలల క్రితమే దీపిక గుండె వేగం పెరగడంతో హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్సతో కోలుకుంది. అప్పట్లోనే ఈ బ్యూటీ ప్రభాస్ తో ప్రాజెక్ట్ -కే షూటింగ్ లో పాల్గొంది. ఇప్పుడు మరోసారి తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. దీంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేర్చారు. దాదాపు హాఫ్ డే ఆమెను ఆసుపత్రిలో అబ్జర్వేషన్ లో ఉంచి అనంతరం పంపించారు.
చివరిసారిగా డైరెక్ట్ టు డిజిటల్ రిలీజ్ 'గెహ్రైయాన్'లో కనిపించిన దీపికా పదుకొణె ఈ ఏడాది మొత్తం షూటింగ్ లతో బిజీగా గడుపుతోంది. క్షణం తీరికలేని షెడ్యూళ్లతో కొనసాగుతోంది. ఇది తన అనారోగ్యానికి కారణమవుతోందని సమాచారం. 'పఠాన్'లో షారుఖ్ ఖాన్ -జాన్ అబ్రహంతో కలిసి నటిస్తోంది.
ఇతర ప్రాజెక్టులలో హృతిక్ రోషన్ - అనిల్ కపూర్ లతో సిద్ధార్థ్ ఆనంద్ లతో ఫైటర్ అత్యంత భారీగా తెరకెక్కనుంది. ప్రభాస్ - అమితాబ్ బచ్చన్ లతో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ K చిత్రీకరణ దశలో ఉంది. అమితాబ్ బచ్చన్ తో ది ఇంటర్న్ రీమేక్ లలో నటించనుంది.
దీపిక హబ్బీ కెరీర్ పరంగా బిజీ దీపిక- రణవీర్ జంట అన్యోన్యత గురించి చెప్పాల్సిన పని లేదు. ఆ ఇద్దరూ కెరీర్ ని అంతే తెలివిగా ప్లాన్ చేసుకుంటున్నారు. దీపిక వరుస చిత్రాలతో బిజీగా ఉండగా.. రణవీర్ సైతం తీరిక లేని షెడ్యూళ్లతో ఉన్నాడు. రణవీర్ కెరీర్ మ్యాటర్ కి వస్తే..
జయేష్‌భాయ్ జోర్దార్ లో షాలినీ పాండేతో కలిసి నటించిన రణ్వీర్ నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు. కానీ ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. కపిల్ బయోపిక్ 83 కూడా ఫ్లాపైన సంగతి తెలిసిందే. అతను తర్వాత జాక్వెలిన్ ఫెర్నాండెజ్ - పూజా హెగ్డేలతో కలిసి రోహిత్ శెట్టి 'సర్కస్'లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో రణవీర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా సర్కస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అలియా భట్ తో కరణ్ జోహార్ దర్శకత్వంలో రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీలో కూడా రణవీర్ నటిస్తున్నాడు. 2019లో విడుదలైన గల్లీ బాయ్ తర్వాత అలియాతో రణవీర్ కి ఇది రెండో సినిమా.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.