Begin typing your search above and press return to search.

'విరాట‌ప‌ర్వం' విష‌యంలో త‌ప్పెక్క‌డ జ‌రిగింది?

By:  Tupaki Desk   |   4 July 2022 7:02 AM GMT
విరాట‌ప‌ర్వం విష‌యంలో త‌ప్పెక్క‌డ జ‌రిగింది?
X
కొన్ని సినిమాల‌కు కాలం క‌ల‌సి రాదు. ఎంత బాగున్నా టైమ్ కు రిలీజ్ కాక‌పోతే వాటి ఫ‌లితం తారు మార‌వుతూ వుంటుంది. మంచి టైమ్ కోసం ఎదురుచూసి రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ చేసిన ప్లాన్ కూడా కొన్ని సార్లు ఆ సినిమాల‌కు లాభాన్ని చూకూర్చ‌క‌పోగా శాపంగా మారుతూ వుంటుంది. స‌రిగ్గా ఇలాంటి ప‌రిస్థితులే 'విరాట‌ప‌ర్వం'కు ఎదుర‌య్యాయా అంటే ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు, ట్రేడ్ ఎన‌లిస్ట్ లు నిజ‌మే అని చెబుతున్నారు. వివ‌రాల్లోకి వెళితే..

రానా ద‌గ్గుబాటి, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన మూవీ 'విరాట‌ప‌ర్వం'. వేణు ఊడుగుల తెర‌కెక్కించారు. డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్ .వి. సినిమాస్ బ్యాన‌ర్ పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మించారు. 90వ ద‌శ‌కంలో ఉత్త‌ర తెలంగాణ‌లో జ‌రిగిన ఓ య‌దార్థ సంఘ‌ట‌న స్ఫూర్తితో అత్యంత ప్ర‌భావ వంత‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో ఈ మూవీని ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల తెర‌కెక్కించారు. న‌క్స‌ల్స్ ఉద్యయానికి ఆక‌ర్షితురాలైన ఓ యువ‌తి తను ప్రేమించిన వ్య‌క్తిని వెతుక్కుంటూ అడ‌వి బాట ప‌ట్టింది. ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా చావైనా అత‌నితోనే అంటూ ఇంటి నుంచి బ‌య‌లుదేరింది.

స్వ‌చ్ఛ‌మైన ప్రేమ తో అడ‌వి బాట ప‌ట్టిన ఆ యువ‌తి తీసుకున్న‌ నిర్ణ‌య‌మే త‌న‌ని అనేక ఇబ్బందుల‌కు గురిచేసింది. చివ‌రికి దారుణ హ‌త్య‌కు గుర‌య్యేలా చేసింది. అపోహ‌ల మ‌ధ్య ఊగీస‌లాడిన వెన్నెల అనే యువ‌తి హ‌త్యోదంతం వెన‌కున్న హృద్య‌మైన క‌థ‌కు చ‌క్క‌ని భావోద్వేగాల‌ని జోడించి ఉద్య‌మాన్ని మించి అంద‌మైన ప్రేమ కావ్యంగా ద‌ర్శ‌కుడు ఈ మూవీని మ‌లిచారు. గ‌త ఏడాది కాలంగా రిలీజ్ వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ మూవీ ఎట్ట‌కేల‌కు భారీ అంచ‌నాల థియేట‌ర్ల‌లో విడుద‌లైంది.

టాక్ బాగున్నా సినిమాని థియేట‌ర్ల‌లో చూడ‌టానికి జ‌నం పెద్ద‌గా రాలేదు. టికెట్ రేట్లు.. ఇత‌ర కార‌ణాల వ‌ల్ల సాధార‌ణ ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డానికి ఆస‌క్తిని చూపించ‌లేదు. దీంతో ఈ మూవీకి టాక్ బాగున్నా ఆద‌ర‌ణ క‌రువైంది. దీంతో మేక‌ర్స్ అ మూవీని నెల‌కూడా తిర‌క్కుండానే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి ఇచ్చేశారు. అందులో సినిమా చూసిన ప్ర‌తీ ఒక్క‌రు వెన్నెల హృద్య‌మైన క‌థ‌కు క‌నెక్ట్ అవుతున్నారు. ఇంత‌టి బ‌రువైన ప్రేమ‌క‌థ‌ని థియేట‌ర్ల‌లో రాంగ్ టైమ్ లో రిలీజ్ చేసి మేక‌ర్స్ త‌ప్పు చేశార‌ని కామెంట్ లు చేస్తున్నార‌ట‌.

సినిమా బాగుంది. వేణు ఊడుగుల డైరెక్ష‌న్ బాగుంది.. సాయి ప‌ల్ల‌వి న‌ట‌న రూప‌ర్‌. ర‌వ‌న్న పాత్ర‌లో రానా బాగా చేశార‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నార‌ట‌. ముందే ఓటీటీ రిలీజ్ చేసి వుంటే బాగుండేద‌ని, థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసి చాలా త‌ప్పు చేశార‌ని చాలా మంది ఓటీటీలో చూసిన వారు కామెంట్ లు చేస్తున్నార‌ట‌. ఈ త‌ప్పుని ముందే మేక‌ర్స్ తెలుసుకుని 'విరాట‌ప‌ర్వం'ని డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ చేసి వుంటే బాగుండేది క‌దా? .. తెలిసి తెలిసి ఈ త‌ప్పెందుకు చేశార‌ని వాపోతున్నారు.