Begin typing your search above and press return to search.
కాజలమ్మ అలా షాక్ ఇస్తుందట!
By: Tupaki Desk | 4 Dec 2018 8:21 AM GMTఒక పాత్రకోసం బరువు తగ్గడం పెరగడం లాంటివి అప్పట్లో హాలీవుడ్ కు మాత్రమే పరిమితం. ఇప్పుడు బాలీవుడ్ దగ్గరనుండి టాలీవుడ్ వరకూ చాలామంది హీరోలు ఇలా చేస్తున్నారు. ఇక లుక్స్ విషయంలో కూడా ఎలాంటి మార్పులకు కూడా వెనుకాడడంలేదు. దర్శకుడు శంకర్ తన సినిమల్లో హీరో.. హీరోయిన్ల చేత గెటప్స్ మా మార్పించడం లో దిట్ట. తన మొదటి సినిమా 'జెంటిల్ మేన్' నుండి తాజా చిత్రం '2.0' వరకూ అది మనం గమనించవచ్చు. ఇప్పుడు అదే ట్రెండ్ తన నెక్స్ట్ సినిమాకు ఫాలో అవుతున్నాడట.
'2.0' తర్వాత శంకర్ కమల్ హాసన్ హీరోగా 'భారతీయుడు 2' ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమాలో కమల్ - కాజల్ అగర్వాల్ ఇద్దరూ నెవర్ బిఫోర్ లుక్ లో కనిపిస్తారట. ఈ సినిమా కోసం ఇప్పటికే కమల్ హాసన్ బరువు తగ్గారట. శంకర్ ఈమధ్యే కమల్ పాత్రకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా నిర్వహించారట. త్వరలో కాజల్ అగ్వరాల్ లుక్ టెస్ట్ జరుగుతుందట. మరి శంకర్ వీరిద్దరికోసం ఎలాంటి గెటప్స్ డిజైన్ చేసి పెట్టారో మనకు ఇప్పుడే తెలిసే అవకాశం మాత్రం లేదు.
లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమా ను డిసెంబర్ 14 న ప్రారంభిస్తారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెట్స్ నిర్మాణంలో ఉన్నాయట. ఈ సినిమాలు శింబు.. దుల్కర్ సల్మాన్ లు కీలక పాత్రల్లో నటిస్తారని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.