Begin typing your search above and press return to search.

నిలకడ లేని ప్రకాష్ రాజ్ తో ఓటర్లు సాధించేందేంటి?

By:  Tupaki Desk   |   13 Oct 2021 5:33 AM GMT
నిలకడ లేని ప్రకాష్ రాజ్ తో ఓటర్లు సాధించేందేంటి?
X
మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ ఎన్నికలు (మా) రణరంగాన్ని తలపించాయి. రాజకీయాలను మించి రక్తి కట్టించాయి. ఈ రచ్చ ఫైట్ లో మంచు విష్ణు గెలిచి.. ప్రకాష్ రాజ్ ఓడిపోయాడు. నిజానికి అంతా ప్రకాష్ రాజ్ గెలుస్తాడని అనుకున్నారు. మెగా ఫ్యామిలీ సహా కీలక సినీ ప్రముఖులంతా ఆయన వెన్నంటే ఉన్నారు.కానీ ప్రకాష్ ఓడిపోవడంతో ఇప్పుడు ఆ ప్యానెల్ అంతా రాజీనామాల బాటపట్టారు.

ప్రకాష్ రాజ్ వర్గం నిన్న రాజీనామా చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోస్టల్ బ్యాలెట్లలో అన్యాయం జరిగిందని.. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని.. అనసూయ లాంటి వారిని ముందు గెలిచిందని..ఆ తర్వాత ఓడిందని చెప్పారని ప్రకాష్ రాజ్ వర్గం ఆరోపించింది. ఇక బెనర్జీ లాంటి వారు మోహన్ బాబు అమ్మనా బూతులు తిట్టారని కన్నీళ్ల పర్యంతం అయ్యారు. మోహన్ బాబు చేసిన రౌడీయిజాన్ని ప్రకాష్ రాజ్ వర్గం ఎండగట్టింది. రాత్రికి రాత్రే ఫలితాలు మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికలు అన్నాక ఒకరు గెలవడం.. మరొకరు ఓడిపోవడం సహజం. నచ్చిన వారికి సభ్యులు ఓటేస్తారు. అందుకే ప్రకాష్ రాజ్ ఓడినా.. ఆయన ప్యానెల్ నుంచి 11 మంది గెలిచారంటే వాళ్లకు ‘మా’ సభ్యుల మద్దతు ఉన్నట్టే కదా.. వాళ్లకు ఓటేసిన వాళ్లంతా ఇప్పుడు ప్రకాష్ రాజ్ వర్గం రాజీనామాతో దారుణంగా మోసపోయినట్టే కదా? అని ఆవేదన చెందుతున్నారు. ప్రకాష్ ను నమ్మి ఓటేసిన వాళ్లకు ఇప్పుడు ఆయన ఏం సమాధానం చెబుతాడని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ గెలిచి మా బిడ్డలం తరుఫున ఐదుగురో.. ఆరుగురో గెలిస్తే అప్పుడు కూడా ఇలానే మూకుమ్మడి రాజీనామాలు చేస్తారా? చేయరు కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

మా ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని.. మోహన్ బాబు తిట్టాడని ప్రకాష్ రాజ్ వర్గం ఆరోపిస్తోంది. దాన్ని నిలదీస్తూ ఎండగట్టడం పోయి అస్త్రసన్యాసం చేస్తూ రాజీనామాలు చేయడం ఏంటని ప్రజాస్వామిక వాదులు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని స్పీచులు దంచికొట్టిన ప్రకాష్ రాజ్ వర్గం దీనిపై ఏం సమాధానం ఇస్తారని అడుగుతున్నారు.

దీన్ని బట్టి ప్రకాష్ రాజ్ మాటలు నిలకడలేనివని అర్థమవుతోందంటున్నారు. ఒకసారి రాజీనామా చేసేసి.. మరోసారి కండీషన్ పెట్టి విత్ డ్రా చేసుకుంటామని.. ప్రశ్నిస్తూనే ఉంటామని ఇలా రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయనలో స్థిరత్వం లేదన్న భావన కలుగుతోంది.

‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ ప్రధానంగా పోటీపడ్డాయి. రెండు వర్గాలు కొద్దిరోజులుగా విమర్శలు, ప్రతి విమర్శలతో రెచ్చిపోయారు. ఎన్నికల వేళ కూడా ప్రకాష్ రాజ్-నరేశ్, శివబాలాజీ-హేమ, మోహన్ బాబు-బెనర్జీలు దాదాపు తిట్టుకొని కొట్టుకునేంత పనిచేశారు. ఎన్నికల వేళ ప్రాంగణం అంతా రచ్చరచ్చ అయ్యింది. ఇక మీడియా ఎదుట మాత్రం ప్రకాష్ రాజ్-మంచు విష్ణు భుజంపై చేయివేసుకొని ఫొటోలకు నవ్వుతూ ఫోజులివ్వడం విశేషం.కౌంటింగ్ ముగిసిన అనంతరం మంచు విష్ణు గెలుపొందారు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) అధ్యక్ష పదవిని మంచు విష్ణు గెలుచుకోవడంపై మాటల మంటలు రేపాయి. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. మోహన్ బాబు దౌర్జన్యం చేశాడని ప్రకాష్ రాజ్ వర్గం సభ్యులు ఆరోపించారు. ఈ ఎన్నికల్లో రాజకీయ నేతలను ఇన్ వాల్వ్ చేశాడని మండిపడ్డారు. మొదటి నుండి మా ఎన్నికలు రాజకీయ నాయకులతో సహా చాలా మంది దృష్టిని ఆకర్షించాయి. తెలంగాణలో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల పరిణామాలపై ట్వీట్ చేయడం ప్రకాష్ రాజ్ వర్గాన్ని మరింత ఆగ్రహానికి గురిచేసింది.