Begin typing your search above and press return to search.
అజయ్-శ్వేత రావూరి లవబుల్ కపుల్స్!
By: Tupaki Desk | 3 Sep 2021 12:30 PM GMTసహాయనటుడు అజయ్ కి తెలుగు ప్రేక్షకుల్లో గొప్ప ఫాలోయింగ్ ఉంది. అజయ్ విలనీ చేసినా.. క్యారెక్టర్లలో నటించినా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని నిరంతరం బిజీ నటుడిగా అవకాశాలు అందుకుంటున్నారు. పరిశ్రమలో స్వయంకృషితో డెడికేషన్ తో ఎదిగిన నటుడిగా అతడి కంటూ ప్రత్యేకించి గుర్తింపు ఉంది. రాజమౌళి.. పూరి లాంటి టాప్ డైరెక్టర్లు ప్రత్యేకించి అజయ్ కోసమే కొన్ని క్యారెక్టర్లను రాసుకున్నారంటే అతడి రేంజును అర్థం చేసుకోవచ్చు.
తెలుగు తెరపై రెండు దశాబ్ధాల ప్రస్థానం అజయ్ సొంతం. దాదాపు 100కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రతినాయకుడిగా..కమెడియన్ గా..హీరో స్నేహితుడి పాత్రలో ఇన్నేళ్లుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఎలాంటి పాత్రలోనైనా సునాయాసంగా పరకాయ ప్రవేశం చేయగల ప్రతిభావంతుడు అతడు. నటుడిగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. తమిళ్.. కన్నడ చిత్రాల్లోనూ తన మార్క్ వేసారు. ఇక అజయ్ వ్యక్తిగత విషయాల్లోకి వస్తే చాలా సింపుల్ గా ఉండే వ్యక్తి. వివాదాలకు దూరంగా ఉంటారు. 20 ఏళ్ల కెరీర్ లో ఏనాడు విమర్శలకు గురైంది లేదు.
అతడు కామ్ గోయింగ్ పర్సనాల్టీ. ఎంతో మంది అగ్ర హీరోల చిత్రాల్లో నటించినా తల బిరుసు అనేది అతడి వద్ద చూడలేదని సన్నిహితులు చెబుతారు. తన పని తాను చూసుకోవడం తప్ప అనవసర వివాదాల్లో తల పెట్టని తత్వం ఆయనది. సోషల్ మీడియా రాజ్యమేలుతున్నా ఆయన మాత్రం ఆ మీడియాకి ఎప్పుడూ దూరంగానే ఉంటూ వచ్చారు. అవసరం మేర ఇంటర్వ్యూలు తప్ప..అనవసరంగా మీడియాలో హైలైట్ అవ్వడానికి ఎంతమాత్రం ఇష్టపడరు. ఇక పెళ్లి తర్వాత అజయ్ పర్పెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ గాను వెలిగిపోతున్నారు. అజయ్- శ్వేతా రావూరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
శ్వేత ప్రోఫెషనల్ ఫ్యాషన్ డిజైనర్. గతంలో శ్వేత రావూరి మిస్ ఇండియా పోటీల్లో ఫైనల్ వరకూ చేరుకున్నారు. పెళ్లి తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా శ్వేత భర్తని అర్ధం చేసుకుని ఎంతో ప్రోత్సహిస్తుందని అజయ్ గత ఇంటర్వ్యూలో చెప్పారు. భార్యభర్తలిద్దరు కూడా ఫిట్ నెస్ ప్రియులు. జిమ్ .. యోగా అంటూ రోజులో కొంత సమయం వాటికే కేటాయిస్తారు. షూటింగ్ లు లేకపోతే విదేశీ ట్రిప్పుల్ని ఆస్వాధిస్తారు. ప్రస్తుతం అజయ్ పాన్ ఇండియా చిత్రాలైన `పుష్ప`..`ఆచార్య` లో నటిస్తున్నారు. మరికొన్ని మీడియం బడ్జెట్ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. అర్థ శతాబ్ధం.. తిమ్మరుసు చిత్రాల్లోనపూ అజయ్ నటించాడు.
ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కాడు
ఆరంభం మహేష్ `ఒక్కడు` లో అజయ్ పాత్రకు యూత్ లో గొప్ప ఐడెంటిటీ దక్కింది. ఆ తర్వాతా పోకిరిలో అజయ్ నటనకు మంచి పేరొచ్చింది. ఇక రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడులో మోస్ట్ పవర్ ఫుల్ మ్యాన్ గా అజయ్ నటించాడు. స్టూడెంట్ నంబర్ 1- సింహాద్రి- ఛత్రపతి -సై లాంటి చిత్రాలలో కెరీర్ ఆరంభమే అతడికి మంచి పేరొచ్చింది. నితిన్ ఇష్క్ చిత్రంలోనూ ప్రధాన విలన్ పాత్రతో మెప్పించాడు. ఇక అజయ్ కథానాయకుడిగాను నటించి మెప్పించారు. తెలుగు నటుల్లో చాలా విలక్షణత ఉన్న స్టార్ గా అజయ్ కి పేరొచ్చింది. మునుముందు అతడి నుంచి మరెన్నో వైవిధ్యమైన పాత్రల ఎంపిక ను పరిశ్రమ నుంచి ఆశించవచ్చు. ఏడాదికి డజను పైగా ఆఫర్లతో బిజీగా ఉండే అజయ్ ఫిట్నెస్ ని కాపాడుకునేందుకు ఎంతో శ్రమిస్తుంటారు. ఆ డెడికేషన్ .. క్లీన్ ఇమేజ్ ఉన్న క్యారెక్టర్ అతడిని ఇంత పెద్ద స్థాయిలో నిలబెట్టాయని పరిశ్రమ సన్నిహితులు చెబుతుంటారు. విజయవాడ వాస్తవ్యుడు అయిన అజయ్ ఎంసెట్ లాంగ్ టెర్మ్ కోచింగ్ పేరుతో జూబ్లీహిల్స్ లో అడుగు పెట్టాడు. ఆ తర్వాత మధు ఫిలింఇనిస్టిట్యూట్ లో చేరి నటుడయ్యాడు. ఇప్పుడు పెద్ద స్థాయి నటుడిగా ఏల్తుండడం ఫేట్ అనే చెప్పాలి.