Begin typing your search above and press return to search.
'రాధే శ్యామ్' వ్యూస్ పై యూట్యూబ్ చెప్పిన మాట అదే!
By: Tupaki Desk | 27 Oct 2021 10:32 AM GMTప్రభాస్ అభిమానులంతా మంచి ఆకలితో ఉన్నారు. 'బాహుబలి 2' తరువాత ఆయనకి హిట్ లేదు. 'సాహో' తరువాత ఆయన సినిమా ఏదీ థియేటర్లకు రాలేదు. అందువలన వాళ్లంతా ఆయన సినిమా వస్తే చాలు .. థియేటర్లపై దండయాత్ర చేసేద్దాం అన్నంత కసిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తాజా చిత్రంగా 'రాధే శ్యామ్' సినిమా రూపొందింది. యూవీ క్రియెషన్స్ .. గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా పూజ హెగ్డే కనువిందు చేయనుంది.
మొదటి నుంచి కూడా ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్లు చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే ఈ సినిమా నుంచి ప్రమోషన్ల వేగాన్ని పెంచుతున్నారు. రీసెంట్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఒక టీజర్ వదిలారు. ప్రభాస్ పాత్ర స్వరూప స్వభాలను ఆవిష్కరించడమే ప్రధానమైన ఉద్దేశంగా ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. విక్రమాదిత్య అనే పామిస్ట్ (హస్తసాముద్రికుడు) పాత్రలో ప్రభాస్ కనిపించాడు. ప్రభాస్ మనసులో మాటగా ఆసక్తికరమైన ఆయన వాయిస్ ఓవర్ పై ఈ టీజర్ ను కట్ చేశారు. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ టీజర్ ఒక రేంజ్ లో దూసుకుపోయింది.
చాలా తక్కువ సమయంలో అత్యధిక వ్యూస్ ను సాధించిన టీజర్ గా కొత్త రికార్డును సెట్ చేసింది. ఆ తరువాత ఒకానొక మార్క్ దగ్గర వ్యూస్ ఆగిపోయాయి .. ఆ తరువాత వ్యూస్ తగ్గడం కూడా జరిగింది. తమ అభిమాన హీరో టీజర్ రికార్డుల దిశగా పరుగులు తీస్తుండగా, ఈ విధంగా జరగడం పట్ల అభిమానులు తీవ్రమైన అసహనానికి లోనయ్యారు. ఇందుకు గల కారణాలను గురించి ప్రశ్నిస్తూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దాంతో యూ ట్యూబ్ టీమ్ రంగంలోకి దిగిపోయి, ఈ విషయంపై ఒక క్లారిటీ ఇచ్చింది.
కొన్ని సార్లు యూ ట్యూబ్ వ్యూస్ కౌంట్ అప్ డేట్ చేయడం అనేది కాస్త స్లో అవుతుంది. మరికొన్ని సందర్భాల్లో కాస్త ఆలస్యం కూడా కావొచ్చునని చెప్పారు. దాంతో ప్రభాస్ అభిమానులు కాస్త కూల్ అయ్యారు. ఇక ఈ టీజర్ వ్యూస్ సంగతి అలా ఉంచితే, ఈ సినిమా నుంచి మరో టీజర్ ను వదలడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ సారి పూజ హెగ్డే పాత్రకి సంబంధించిన విజువల్స్ పై కట్ చేసిన టీజర్ రావొచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీపావళి రోజున ఈ టీజర్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.