Begin typing your search above and press return to search.
వాట్ ఈజ్ దిస్ అమ్మా!!
By: Tupaki Desk | 7 Oct 2017 5:57 AM GMTరామ్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ఉన్నది ఒకటే జిందగీ. ఫ్రెండ్ షిప్ బేస్డ్ గా సాగే ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల రూపొందిస్తున్నాడు. ఈ నెల 27న విడుదల కానున్న ఈ చిత్రానికి.. ఇప్పుడు ఆడియో బేస్డ్ గా ప్రమోషన్స్ జరుగుతున్నాయి.
ఫ్రెండ్ షిప్ డేను పురస్కరించుకుని.. 'ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు' అంటూ సాగే పాటను విడుదల చేయగా.. బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రంలోంచి మరో లిరిక్ ను విడుదల చేశారు. 'వాట్ అమ్మా వాట్ ఈజ్ దిస్ అమ్మా' అంటూ సాగే పాటకు అద్భుతమైన స్పందన వస్తోంది. అతి తక్కువ మ్యూజిక్.. ఆర్కెస్ట్రా ఉపయోగిస్తూ.. అదిరిపోయే బీట్ ను ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. పైగా ఈ పాటను తనే పాడేయడంతో.. వాట్ అమ్మా పాటకు మరింతగా ప్రాణం వచ్చేసింది. శ్రీమణి రాసిన పాటకు.. రాక్ స్టార్ డీఎస్పీ సూపర్బ్ ట్యూన్ కట్టాడు. ఇప్పటివరకూ విడుదల చేసిన పాటలు అదరగొట్టేయడం చూస్తుంటే.. రామ్ కోసం ఉన్నది ఒకటే జిందగీ మూవీకి దేవిశ్రీ సూపర్బ్ ట్యూన్స్ ఇచ్చేశాడని.. యూత్ కి ఇన్ స్టంట్ గా కనెక్ట్ అయిపోవడమే టార్గెట్ అని అర్ధమవుతోంది.
ఉన్నది ఒకటే జిందగీ చిత్రంలో లావణ్య త్రిపాఠి.. అనుపమా పరమేశ్వరన్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. స్నేహితుల మధ్య అనుబంధం ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీని స్రవంతి రవికిషోర్.. కృష్ణ చైతన్యలు నిర్మిస్తున్నారు.