Begin typing your search above and press return to search.
ఆ హీరోకు ఏం కాలేదు... అంతా పుకార్లు
By: Tupaki Desk | 15 May 2018 11:30 AM GMTవాట్సాప్‌లో ఏ వార్తయినా ఇట్టే పుట్టేసి... అలా చక్కర్లు కొట్టేస్తుంది. ఎంతలా అంటే పోలీసులను అధికారులకు చివరికి ప్రభుత్వాన్ని కూడా పరుగులు పెట్టించేంతలా. ఇదిగో ఇప్పుడు అదే జరిగింది. నిక్షేపంలా ఉన్న హీరోకి యాక్సిడెంట్ అయిందంటూ తప్పుడు వార్తలు వాట్సాప్ షేర్ అవుతూ వచ్చాయ్. దాంతో పోలీసులు రంగంలోకి దిగి అదంతా ఉత్తిదే నమ్మకండి. ఆ వార్తలను పుట్టించిన వ్యక్తిని పట్టుకుంటాం హెచ్చరించారు. ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్. కాజోల్ భర్త.
అజయ్ దేవగన్ మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ప్రాంతంలో షూటింగ్ కోసం వెళ్లాడని తిరిగి వస్తుంటే అతను ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కు ప్రమాదం జరిగి కూలిపోయిందంటూ వాట్సాప్‌లో వార్తలు దర్శనమిచ్చాయి. అవి ఎక్కువ మందికి షేర్ అవ్వడం పోలీసులు దృష్టిలోనూ పడింది. వెంటనే మహాబలేశ్వర్ పోలీసులు స్పాట్‌కు వెళ్లి అక్కడంతా చెక్ చేసుకుని వచ్చారు. అలాంటిదేమీ జరగలేదని అంతా పుకారేనని తేల్చారు. మరొక పోలీసాఫీసర్ మాట్లాడుతూ ఆ మెసేజ్ మొదట వారం రోజుల క్రితం సర్వ్యులేట్ అయిందని చెప్పుకొచ్చారు. ఈ వార్తని పుట్టించిన వ్యక్తిని పట్టుకునే పనిలో ఉన్నట్టు చెప్పాడు. ఇలాంటి గాలి వార్తలను ఎవరు పంపినా వాటిని ఎవరికీ షేర్ చేయవద్దని కోరుతున్నారు పోలీసులు. దీని వల్ల తమకు కూడా చాలా సమయం వృధా అవుతుందని చెబుతున్నారు.
సెలెబ్రిటీలపై ఇలాంటి గాలి వార్తలు ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటాయ్. వాట్సాప్ ఫేస్ బుక్ ఇలాంటి సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఇవి త్వరగా సర్య్కులేట్ అవుతున్నాయ్. హీరో హీరోయిన్ల పెళ్లిళ్లపై అనేక రూమర్లు వస్తున్నాయ్. అంతెందుకు మొన్నటి వరకు మెగా డాటర్ నీహారిక బాహుబలి ప్రభాస్ పెళ్లి చేసుకుంటున్నారంటూ ఒకటే వార్తలు హల్ చల్ చేశాయి. తీరా చూస్తే అవన్నీ ఒట్టి పుకార్లేనని తేలింది.