Begin typing your search above and press return to search.
'పెళ్లి సందD'లో కొత్త సందడి ఎంత?
By: Tupaki Desk | 4 Oct 2021 2:30 AM GMTకరోనా కారణంగా కట్టడి చేయబడిన సినిమాలన్నీ కూడా, పంజరంలో నుంచి బయటపడి రామచిలుకల్లా రయ్యిమంటూ థియేటర్ల వైపుకు దూసుకొస్తున్నాయి. దసరా పండుగ సందర్భంగా సందడి చేయాలనే పట్టుదలతో పరిగెత్తుకు వస్తున్నాయి. దసరా బరిలో 'కొండ పొలం' .. 'వరుడు కావలెను' .. 'మహా సముద్రం'తో పాటు,' పెళ్లిసందD' , సినిమా కూడా రంగంలోకి దిగుతోంది. ఈ సినిమాతో గౌరి రోణంకి దర్శకురాలిగా పరిచయం అవుతుంటే, రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు.
శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాతో, కథనాయికగా శ్రీలీల పరిచయమవుతోంది. ఈ సినిమా నుంచి టీజర్ .. ట్రైలర్ .. సాంగ్స్ ను వరుసగా వదులుతూనే వస్తున్నారు. అయితే చిత్రీకరణపరంగా .. సన్నివేశాల పరంగా .. గతంలో వచ్చిన 'పెళ్లి సందడి ఫ్లేవర్ ను తప్పించుకోలేక పోతోందనేది బయట వినిపిస్తున్న టాక్. ఫొటోగ్రఫీ .. కొరియోగ్రఫీలో తప్ప ఎక్కడా కొత్తదనం కనిపించడం లేదనేది సోషల్ మీడియాలో కనిపిస్తున్న కామెంట్. గతంలో వచ్చిన 'పెళ్లిసందడి'ను మ్యూజికల్ హిట్ గా నిలబెట్టిన కీరవాణి - చంద్రబోస్, ఈ సినిమాకి కూడా కలిసి పనిచేశారు. దాంతో సంగీత సాహిత్యాల పరంగా కూడా అప్పటి ముద్రనే కనిపిస్తోందని అంటున్నారు.
రాఘవేంద్రరావు .. శ్రీకాంత్ తో 'పెళ్లి సందడి' చేసినప్పటి రోజులు వేరు. అబ్బాయి మొహమాట పడటం .. అమ్మాయి సిగ్గుల మొగ్గకావడం .. ఒక వైపున మగపెళ్లివారి ఆడంబరాలు .. మరో వైపున ఆడపెళ్లివారి సంబరాలు .. మర్యాదలు .. ఆటపట్టించడాలు .. అలకలు .. బుజ్జగింపులు .. ఇలాంటివన్నీ అప్పట్లో ఆ సినిమాకి ఒక నిండుదనాన్ని తీసుకొచ్చాయి. కానీ ఇప్పటి పరిస్థితి వేరు .. ప్రేమకి అర్థం .. పెళ్లికి నిర్వచనం మారలేదుగానీ, వాటిని తెరపై ఆవిష్కరించే విధానం పూర్తిగా మారిపోయింది. కలలో కనిపించే అమ్మాయికి కోసం కాలాన్ని ఖర్చు చేస్తూ కూర్చునే రోజులు పోయాయి.
ఈ జనరేషన్ .. ప్రేమను కొత్త కోణంలో చూస్తోంది. పరికిణీలు .. ఓణీలు .. జడకుప్పెలు వేసుకున్న అమ్మాయిలను చూపించినా, ఇటువైపు వాళ్లుగానీ .. అటువైపువాళ్లు గాని పరిచయం చేయని చుట్టాలు హఠాత్తుగా పెళ్లికి ఊడిపడి పాటలు పాడినా వాళ్లు అయోమయానికి లోనవుతారు. ఇప్పుడు ఏం చెప్పాలన్నా .. ఏం చేయాలన్నా చేతిలో స్మార్టు ఫోన్ ఉంది. కుదిరితే వాట్సాప్ .. వీలైతే వీడియో కాల్ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ప్రేమలో దాగుడుమూతల వ్యవహారానికి ఇప్పుడు తావేలేదు.
ఇప్పుడు అలవాటులేనివి .. ఆచరణలో లేనివి చూపిస్తే యూత్ బోర్ ఫీలవుతుంది. ఈ మాత్రం దానికి ఈ సినిమా ఎందుకు? ఆ సినిమానే చూసేవాళ్లం కదా అంటారు. ఇది ఇంతవరకూ ఈ సినిమా నుంచి బయటకొచ్చిన అప్ డేట్లు చూసి జనం అనుకునే మాట. మరి అందుకు భిన్నంగా కొత్తగా ఏదైనా చూపించి ఉంటే మాత్రం, తమ అభిప్రాయాలను వెనక్కి తీసుకోవలసిందే. ఆడియన్స్ ఆశించే కొత్తదనమే ఉంటే, ఈ 'పెళ్లిసందD'లో వాళ్లు కూడా జాయిన్ అవుతారు. అప్పుడు మనం వద్దంటే మాత్రం వింటారా ఏంటి?