Begin typing your search above and press return to search.
కంగనాకు నిర్మాత షాక్
By: Tupaki Desk | 28 Jan 2019 5:41 AM GMTఅత్యంత వివాదాస్పదంగా మారి పలు వివాదాల మద్య తెరకెక్కిన 'మణికర్ణిక' చిత్రం భారీ అంచనాల నడుమ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంకు మిశ్రమ స్పందన వచ్చింది. సినిమాకు ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. ఈ చిత్రం నిర్మాతలకు పెట్టుబడి వచ్చేనా లేదా అంటూ ప్రస్తుతం చర్చ జరుగుతోంది. జీ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన ఈ చిత్రంకు మొదట క్రిష్ దర్శకత్వం వహించగా - ఆయన్ను తప్పించి కంగనా సినిమాను పూర్తి చేసిన విషయం తెల్సిందే.
సినిమా విడుదల సందర్బంగా ఒక ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్టర్స్ పై ఒక వ్యక్తి దెయ్యం అంటూ కామెంట్ చేశాడు. కంగనా అందులో ఉంది కనుక ఆమెను ఉద్దేశించి అతడు దెయ్యం అని ఉండవచ్చు. సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్స్ చాలా కామన్. ఇంతకంటే దారుణమైన కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. కాని ఆ కామెంట్స్ కు ప్రముఖులు స్పందించినప్పుడు అసలు వివాదం మొదలవుతుంది.
ఆ నెటిజన్ దెయ్యం అంటూ చేసిన కామెంట్ కు 'మణికర్ణిక' చిత్ర నిర్మాత కమల్ జైన్ లైక్ కొట్టాడు. సినిమా నిర్మాణ సమయంలో నిర్మాతలతో కంగనాకు చెడింది అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా కంగనాను నెటిజన్ దెయ్యం అంటూ కామెంట్ చేయడం, దాన్ని నిర్మాత లైక్ కొట్టడంతో ఆమెపై నిర్మాత కోపంగా ఉన్నాడని నిరూపితం అయ్యిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాకు దర్శకుడిని మార్చి - పలు సీన్స్ రీ షూట్ చేయడంతో నిర్మాత కమల్ జైన్ అప్పుడు కంగనాపై ఆగ్రహం వ్యక్తం చేయడం - వివాదం ఏర్పడటం జరిగింది. ఆ వివాదాన్ని పక్కన పెట్టి సినిమాను విడుదల చేస్తే సినిమా ఫలితం ఎటూ తేలకుండా ఉంది. అందుకే కంగనాను నేరుగా దెయ్యం అనలేక - నెటిజన్ చేసిన కామెంట్ కు కమల్ జైన్ లైక్ కొట్టి - తన ఉద్దేశ్యం కూడా అదే అంటూ సింబాలిక్ గా చెప్పి ఉంటాడు అంటూ కంగనా యాంటీ ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్నారు. మరి కంగనా నిర్మాత లైక్ పై ఎలా స్పందిస్తుందో చూడాలి.