Begin typing your search above and press return to search.

అతడికి ఐష్ ఎప్పుడు ఓకే చెప్పిందంటే..

By:  Tupaki Desk   |   15 Jan 2017 2:51 PM GMT
అతడికి ఐష్ ఎప్పుడు ఓకే చెప్పిందంటే..
X
బాలీవుడ్ లో బెస్ట్ కపుల్స్ లో ఐష్.. అభిషేక్ బచ్చన్ లు ఒకరిగా చెబుతుంటారు. పెళ్లికి ముందు వివాదాల్ని పక్కన పెడితే.. పెళ్లి తర్వాత మాత్రం వారిద్దరి మధ్య మాంచి రిలేషన్ ఉందని చెబుతారు. మధ్య మధ్యలో కొన్ని వార్తలు వచ్చినా.. అందులో నిజం లేదన్న విషయాన్ని వారిద్దరూ ఎప్పటికప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు.

ఈ మధ్యన ఐష్ కు.. ఆమె అత్త జయాబచ్చన్ మధ్య రగడ ఏదో నడుస్తుందని చెప్పినా.. అదంతా అబద్ధమన్న విషయాన్ని తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ఇద్దరి మధ్య జరిగిన ఒక ఉదంతంతో తేలిపోయింది. కార్యక్రమంలో అలిసిపోయిన ఐష్.. అత్త భుజం మీద వాలి రెస్ట్ తీసుకోవటంతో.. ఇద్దరిమధ్య ఎంత అనుబంధం ఉందో ఇట్టే అర్థమయ్యే పరిస్థితి.

ఇక.. అభిషేక్.. ఐష్ ల మధ్య ఏదో గొడవ నడుస్తుందన్న మాటల్ని..ఒక అవార్డుల ఫంక్షన్ లో అందరిముందు హగ్ చేసుకోవటం ద్వారా.. అభిషేక్ అంటే తనకున్న లవ్ ఎంతన్నది చెప్పేసింది. తాజాగా.. తమ పెళ్లి జరిగి పదేళ్లు కావొస్తున్న వేళ.. తన లవ్ ప్రపోజల్ ను ఐష్ ఎలా ఓకే చేసిందన్న ఆసక్తికర విషయాన్ని అభిషేక్ చెప్పుకొచ్చారు.

తన కంటే మూడేళ్లు పెద్దదైన ఐశ్వర్యను వివాహమాడిన అభిషేక్..తమ మధ్య ప్రేమ మణిరత్నం దర్శకత్వం వహించినగురు చిత్రంలో స్టార్ట్ అయినట్లు వెల్లడించారు. ఐష్ కు తానే మొదట ప్రపోజ్ చేశానని.. అన్నీ ఆలోచించిన తర్వాత తన ప్రేమకు ఐష్ ఓకే చెప్పిందన్నారు. న్యూయార్క్ లోని ఒక బాల్కనీలో ఐష్ తన ప్రపోజల్ ను ఓకే చేసిందని అభిషేక్ చెప్పారు.దీనికి సంబంధించిన ఒక ట్వీట్ ను చేశారు. అభిషేక్ స్వీట్ మెమరీస్ లోకి వెళ్లిన పుణ్యమా అని.. ఒక కొత్త విషయం వారిఅభిమానులకు తెలిసిందని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/