Begin typing your search above and press return to search.
టీవీ హోస్ట్ కు చీర కట్టిన మాజీ ప్రపంచ సుందరి...!
By: Tupaki Desk | 17 May 2020 11:30 PM GMTమాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ కి సినీ ఇండస్ట్రీలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందంతో పాటు యాక్టింగ్ మరియు డ్యాన్స్ లతో కోట్లాది మనసుల్ని ఈ నీలికళ్ల సుందరి కొల్లగొట్టింది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో కూడా ఐశ్వర్యరాయ్ ఓ ఊపు ఊపేసింది. 'ఇద్దరు' 'ప్రియురాలు పిలిచింది' 'జీన్స్' 'రావణ్' తదితర చిత్రాల్లో తన అందం అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. టాలీవుడ్ లో కింగ్ నాగార్జున హీరోగా నటించిన 'రావోయి చందమామ' సినిమాలో ఒక సాంగ్ లో కనిపించి అదరగొట్టింది. బాలీవుడ్ లో బిజీ కావడంతో దక్షిణాది వైపు చూడలేకపోయింది. బాలీవుడ్ యాక్టర్ అభిషేక్ బచ్చన్ ని వివాహం చేసుకొని బచ్చన్ ఫ్యామిలీకి కోడలైంది. ఇదిలా ఉండగా తాజాగా ఐశ్వర్యారాయ్ సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఐశ్వర్యరాయ్ ప్రముఖ హాలీవుడ్ టీవీ హోస్ట్ ఓప్రా విన్ ఫ్రేకు చీర కట్టుకోవటం ఎలాగో నేర్పుతున్న వీడియో ఒకటి బయటకి వచ్చింది. దాదాపు పదిహేనేళ్ల క్రితం జరిగిన ఆ ఇన్సిడెంట్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే 2005లో ఐశ్వర్యరాయ్ ఓప్రా షోలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా ఐశ్వర్య ఈ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ చీరని ఆమె ఓప్రాకు బహుమతిగా ఇచ్చారు. అంతేకాకుండా దాన్ని ఆ హోస్ట్ కి కట్టారు. చీరలో తాను అందంగా కనిపిస్తున్నానని ఓప్రా సంతోషం వ్యక్తం చేశారు. ఈ షోలో ఐశ్వర్య రాయ్ భారతీయ సంస్కృతి ఆతిథ్యం గురించి చెప్పారు. కామసూత్ర పుట్టిన గడ్డనుంచి వచ్చానంటూ తనను తాను పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత రోజుల్లో ఐశ్వర్య - అభిషేక్ లు భార్యభర్తలుగా ఓప్రా షోలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఓప్రా ఇండియాకి వచ్చిననప్పుడు ఈ దంపతులు ఆతిథ్యం ఇచ్చారు.