Begin typing your search above and press return to search.
జార్జియా కారు డ్రైవర్ కు స్వీటీ అంత సాయం చేసిందా?
By: Tupaki Desk | 13 March 2020 5:00 AM GMTఅందంగా ఉండటం పెద్ద విషయం కాదు. కానీ.. అందమైన మనసు ఉండటం చాలా పెద్ద విషయం. అందులోనూ ఎమోషన్స్ పెద్దగా ఉండవని చెప్పే సినిమా ఇండస్ట్రీలో.. అందుకు భిన్నంగా వ్యవహరించే తీరు చూసినప్పుడు.. తెలుగు సినిమాల్లో చూపించే కొన్ని హీరోయిన్ క్యారెక్టర్ కు నిలువెత్తు రూపంగా అనుష్క కనిపిస్తారు. ముద్దుగా అందరూ స్వీటీ అని పిలిచే ఈ అందాల భామకున్న అందమైన మనసుకు ఎవరైనా ఫిదా కావాల్సిందే.
ఆమె మనసు ఎంత విశాలంగా..దయార్థంగా ఉంటుందో చెప్పేశారు ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి. తాను ఐదారు నెలల క్రితం జార్జియాకు వెళ్లినట్లు చెప్పిన ఆయన.. అక్కడ కారు డ్రైవర్ కమ్ కేర్ టేకర్ గా వ్యవహరించే గాజా.. మీకు స్వీటీ తెలుసా? అని ప్రశ్నించటం తో తాను షాక్ తిన్నట్లు చెప్పారు.
ఒక పని మీద తానా దేశానికి వెళ్లినప్పుడు తనకు గాజా అనే కారు డ్రైవర్ కలిశాడని.. అతగాడు స్వీటీ గురించి అడిగి.. ఆమె తనకు చేసిన సాయం గురించి చెప్పుకున్నాడని చెప్పారు. తమిళ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు జార్జియాకు వెళ్లిన స్వీటీకి.. కారు డ్రైవర్ గా.. కేర్ టేకర్ గా వ్యవహరించిన గాజా కారును ఫైనాన్స్ వారు తీసుకెళ్లిపోతే.. అనుష్క అతడికి కొత్త కారు కొనిచ్చిన వైనాన్ని తనకు చెప్పారంటూ కొత్త విషయాన్ని రివీల్ చేశారు. ఏమైనా అందాల బొమ్మ అనుష్కలో ఇంత అందమైన మనసు ఉందన్న విషయం తెలిసినప్పుడు ఆమె మీద మర్యాద.. గౌరవం మరింత పెరగటం ఖాయం.