Begin typing your search above and press return to search.
బాలీవుడ్ ప్లేబాయ్ గుట్టుబయటపెట్టిన స్టార్ హీరోయిన్...!
By: Tupaki Desk | 29 April 2020 1:30 AM GMTబాలీవుడ్ సెలబ్రెటీలు ఎప్పుడు లవ్ చేసుకుంటారో ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారో ఎవరికి తెలియదు. బాలీవుడ్ లవ్ బర్డ్స్ స్టార్ హోదాను మరచిపోయి ప్రవర్తిస్తూ కొన్నిసార్లు కెమెరాకు చిక్కిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. బాలీవుడ్ లో ప్రేమలో పడటం.. బ్రేకప్ చెప్పుకోవడం.. మళ్లీ ప్రేమలో పడటం అన్నీ కామనే. అయితే అన్ని వ్యవహారాలున్నా రణ్ బీర్ కపూర్ మాత్రం అందరిలోనూ ప్రత్యేకంగా నిలుస్తాడు. బాలీవుడ్ ప్లేబాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ చాలా మంది హీరోయిన్లతో ప్రేమాయణం సాగించాడు. కొన్నేళ్ల క్రితం దీపికా పదుకొనె, రణ్ బీర్ ల మధ్య డేటింగ్ ఏ రేంజ్ లో కొనసాగిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రణబీర్ సంగతి ఏమో కానీ దీపికా అయితే అప్పుడు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. అందరూ వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు అని భావిస్తున్న టైములో.. సడన్ గా తమ లవ్ బ్రేకప్ చేసుకున్నారు. రణబీర్ దీపికాతో బ్రేకప్ చేసుకోడానికి ఆయన తల్లి నీతూ కపూర్ కారణమనే వార్తలు చాలా రోజులు క్రితం వచ్చాయి. అయితే దీపికా చాలా ఆవేదనకు లోనైనట్లు.. తనకి జరిగిన మోసం గురించి కొంచెం కొంచెంగా స్పందిస్తూ వచ్చింది.
ఇప్పుడు తాజాగా దీపికా మరోసారి తన బ్రేకప్ స్టోరీపై స్పందించిందట. 'శృంగారం అనేది మనసుకు సంబంధించింది.. శరీరానికి సంబంధించింది కాదు అంటూ.. ఒకసారి మోసం చేస్తే పొరపాటు అనుకోవచ్చు.. రెండవసారి కూడా అదే పని చేస్తూ దొరికిపోతే.. మనపై అతనికి ఎలాంటి ప్రేమ లేదని అర్థం చేసుకోవచ్చు' అని దీపికా ఇండైరెక్ట్ గా రణ్ బీర్ పేరు ప్రస్తావించకుండానే అతను చేసిన మోసం గురించి చెప్పిందట. ఆ తరువాత ఎన్నో రోజులు తీవ్ర మనోవేదనకు లోనయ్యానని దీపికా చెప్పిందట. ఇక రణ్ బీర్ ప్రేమకు బ్రేకప్ చెప్పిన దీపికా ఆ తరువాత రణ్ వీర్ సింగ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు దీపికా పదుకొణేకి టాటా చెప్పిన రణ్ బీర్ మాత్రం కొన్ని రోజులు కత్రినా కైఫ్ తో డేటింగ్ చేసి ఆ తరువాత యంగ్ బ్యూటీ ఆలియా భట్ ని లైన్ లో పెట్టాడు. గత ఏడాది నుంచి వీరి వివాహంపై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. కొన్నిసార్లు వీరి మధ్య బ్రేకప్ అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని ఈ లవ్ బర్డ్స్ క్లారిటీ ఇచ్చాయి. మరి రణబీర్ ఈ ముద్దు గుమ్మతో రిలేషన్ షిప్ అయినా పెళ్ళిపీటల దాకా తీసుకొస్తాడేమో చూడాలి.