Begin typing your search above and press return to search.

ద‌ర్శ‌క‌సంఘం సొంత భ‌వంతి ఎప్ప‌టికి?

By:  Tupaki Desk   |   27 July 2019 1:30 AM GMT
ద‌ర్శ‌క‌సంఘం సొంత భ‌వంతి ఎప్ప‌టికి?
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా).. నిర్మాత‌ల సంఘం (టీఎఫ్‌ పీసీ) స‌హా ప‌రిశ్ర‌మ‌లో 24 శాఖ‌ల్లో సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌ల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఎవ‌రికి వారు సొంతంగా భ‌వంతి నిర్మాణం కోసం నిధి సేక‌ర‌ణ‌లు చేస్తున్నారు. ఇప్ప‌టికే కొన్ని అసోసియేష‌న్ల‌కు సొంత భ‌వంతులు ఉన్నాయి. స‌భ్యుల‌కు సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేస్తూ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. ఇందులో మా అసోసియేష‌న్ ముందు వ‌రుస‌లో ఉంది. ఈసారి తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం ఈ త‌ర‌హా సంక్షేమ కార్య‌క్ర‌మాల కోసం ఒక ట్ర‌స్ట్ ని ఏర్పాటు చేసింది.

ద‌ర్శ‌కేంద్రుడు రాఘవేంద్ర రావు చైర్మన్ గా ద‌ర్శ‌క దినోత్స‌వాన్ని పుర‌ష్క‌రించుకుని మే4 (దాస‌రి జ‌యంతి) తెలుగు చలన చిత్ర దర్శకుల సంక్షేమం కోసం తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్ (టీఎఫ్‌ డీటీ) ని ప్రారంభించారు. ఈ ట్ర‌స్ట్ ద్వారా సంఘ సభ్యులలో ఆర్థికంగా ఇబ్బందుల్లో వున్న వారికి ఆరోగ్యం- విద్య- కుటుంబ అవసరాలకి సహాయం చేసే విధంగా ఒక నిధి ని ఏర్పాటు చేయాల‌ని తద్వారా వచ్చే వడ్డీ తో అర్హులైన వారికి సాయం చేయాల‌ని తీర్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలోనే ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి 50 ల‌క్ష‌లు.. మెగాస్టార్ చిరంజీవి- 25 ల‌క్ష‌లు..కె.రాఘ‌వేంద్ర‌రావు-10ల‌క్ష‌లు.. ఆర్కా మీడియా -15లక్ష‌లు .. ఇవ‌న్నీ క‌లుపుకుని కోటి విరాళం ద‌ర్శ‌క సంక్షేమ నిధికి ప్ర‌క‌టించారు.

24 జూలై 2019 తేదీన‌ ట్రస్ట్ ని రిజిస్టర్ చేసి ఈ ట్ర‌స్ట్ కి ఎన్‌.శంకర్ మేనేజింగ్ ట్రస్టీగా ప్ర‌క‌టించారు. ప్రస్తుత దర్శకుల సంఘం ట్ర‌స్ట్ ప్యానెల్ ని ఏర్పాటు చేశారు. వి వి వినాయక్ - సుకుమార్- బోయపాటి శ్రీను- సురేందర్ రెడ్డి- హరీష్ శంకర్- వంశీ పైడిపల్లి- మెహెర్ రమేష్ (ట్రెజ‌ర‌ర్)- కొరటాల శివ- నందిని రెడ్డి- రాంప్ర‌సాద్‌- కాశీ- బి.వి.ఎస్‌.ర‌వి .. ట్రస్టీలు గా ఉన్నారు. విరాళాల సేకరణ .. సహాయ నిధి ని త్రికరణ శుద్ధిగా సభ్యుల అత్యవసర అవసరాలకి అందించే విధంగా టీఎఫ్‌ డీటీ చ‌ర్య‌లు తీసుకోనుంది. ఈ ట్ర‌స్ట్ కు సేక‌రించే నిధి తో సొంత భ‌వంతి- లైబ్ర‌రీ- ఫంక్ష‌న్ హాట్- ద‌ర్శ‌క‌త్వ శాఖ త‌ర‌గ‌తులు- ఆధునిక ప‌రిజ్ఞానం అందుబాటులోకి తేవాల‌న్న ప్ర‌య‌త్నం సాగుతోంది.