Begin typing your search above and press return to search.

హరిహర వీరమల్లు.. మోక్షమెప్పుడయ్యా?

By:  Tupaki Desk   |   17 Jan 2023 7:10 AM GMT
హరిహర వీరమల్లు.. మోక్షమెప్పుడయ్యా?
X
తన జీవితం ఒక రాజకీయాలకే అంకితం అని ప్రకటించి 2019 ఎన్నికల్లో పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్... మళ్ళీ సినిమాలు చేయడం మొదలుపెట్టారు. అలా చేసిన వాటిలో ఇప్పటికే వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ సినిమాగా రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా విషయంలో మాత్రం అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

క్రిష్ దర్శకత్వంలో ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా అనేక సార్లు వాయిదా పడుతూ వస్తుంది. కరోనా సహా సినీ పరిశ్రమంలో ఉన్న అనేక కారణాలతో ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఒకానొక దశలో ఈ సినిమా ఆగిపోయిందంటూ కూడా ప్రచారం జరిగింది.

ఏఏమ్ రత్నం ఆర్థిక పరంగా దెబ్బతినడంతో సినిమా ఆగిపోయింది అని ఒకసారి... క్రిష్ కి పవన్ కళ్యాణ్ కి మధ్య క్రియేటివి డిఫరెన్స్ రావడం వల్ల ఆగిపోయిందని ఒకసారి ఇలా రకరకాల ప్రచారాలు అయితే జరుగుతూ వచ్చాయి. అయితే చివరికి ఈ సినిమాని ఖచ్చితంగా ఈ సమ్మర్ సీజన్లో విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.

కానీ ఇప్పుడు అది కూడా విడుదల అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సమ్మర్ సీజన్ కి కూడా హరిహర వీరమల్లు థియేటర్లలో రిలీజ్ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.

ఈ సినిమా అంతా మొగలుల కాలంలో జరుగుతూ ఉండడంతో షూటింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనికి ఎక్కువ సమయం పడుతుందని... అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతుంది.

ఈ ఏడాది సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ కావడం కష్టమే అని అంటున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థం తరువాతే ఈ సినిమా ఎప్పుడు విడుదల చేస్తామనే విషయం మేకర్స్ చెప్పలేకపోతున్నారని అంటున్నారు. ఇక దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్, నర్గీస్ పక్రి, ఆదిత్య మీనన్ వంటి వారి ఇతర పాత్రలలో నటిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.