Begin typing your search above and press return to search.
శ్రీరెడ్డి ఎపిసోడ్లకు పుల్ స్టాప్ ఎపుడు?
By: Tupaki Desk | 14 April 2018 3:06 PM GMTటాలీవుడ్ లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు - క్యాస్టింగ్ కౌచ్ పై హీరోయిన్ శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు పెను ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. అర్ధనగ్న ప్రదర్శన తర్వాత జాతీయ మీడియాలో కూడా శ్రీరెడ్డి పై కథనాలు వచ్చాయి. ఆ తర్వాత `మా` ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి శ్రీరెడ్డి పై నిషేధం ఎత్తి వేస్తున్నామని, `క్యాష్`కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. అయితే, తన డిమాండ్లలో 20 శాతం మాత్రమే `మా` నెరవేర్చిందని, తన పోరాటం తన ఒక్కదాని కోసం కాదని శ్రీరెడ్డి చెప్పింది. భవిష్యత్తులో కూడా యువజన, మహిళా సంఘాలతో కలిసి పోరాడుతానని, తనను ఇకపై శ్రీ రెడ్డి అని కాకుండా శ్రీ శక్తి అని పిలవాలని తెలిపింది. `మా `ప్రెస్ మీట్ తర్వాత కూడా తన ఫేస్ బుక్ ఖాతాలో కొందరిపై ఆరోపణలు చేసింది. అయితే, శ్రీరెడ్డి చెప్పిన వాటిలో `మా` కొన్నింటిపై స్పందించిన తర్వాత కూడా ఆమె ఫొటోల లీక్ లు - ఆరోపణలు ఆపకపోవడం....మీడియాలో రోజుకో ఎపిసోడ్ చొప్పున రిలీజ్ చేయడంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. అటు టాలీవుడ్ ...ఇటు శ్రీరెడ్డి....ఇద్దరి పక్షాన కాకుండా తటస్థంగా ఉండి శ్రీరెడ్డి వ్యవహారంపై లోతుగా ఆలోచిస్తే కొన్ని విషయాలు అవగతమవుతాయి.
ఇండస్ట్రీలో ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ - కోర్టులను ఆశ్రయించినపుడే పూర్తి న్యాయం జరుగుతుందని జనసేన అధ్యక్షుడు పవన్ కూడా అన్నారు. కేసులు పెట్టినా న్యాయం జరగకపోతే మీడియాను ఆశ్రయించాలని, ముందుగా మీడియాలో హల్ చల్ చేయడం వల్ల ఉపయోగం ఉండదని శ్రీరెడ్డి వ్యవహారంపై అభిప్రాయపడ్డారు. వాస్తవానికి దగ్గుబాటి అభిరామ్ ఫొటోలు లీక్ చేసిన శ్రీరెడ్డి...అతడిపై ఇప్పటివరకు కేసు నమోదు చేయకపోవడం పై పలువురు చర్చించుకుంటున్నారు. అభిరామ్ కాకుండా చాలామంది తనను వాడుకున్నారని చెబుతోన్న శ్రీరెడ్డి...వారందరిపై ఫిర్యాదు చేయవచ్చుకదా అని అభిప్రాయపడుతున్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై పోలీసు విచారణకు సిద్ధమని కోన వెంకట్ చెప్పినప్పటికీ ఆమె ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని కొందరికి సందేహం కలుగుతోంది. వచ్చే వారం కొరటాల శివ దర్శకత్వం వహించిన భరత్ అనే నేను విడుదల కు ముందు ఆయనపై ఆరోపణలు గుప్పించడం ఎంతవరకు సబబు అని చర్చించుకుంటున్నారు.
ఇవన్నీ చూస్తుంటే...చీప్ పబ్లిసిటీ కోసం శ్రీరెడ్డి బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం నడిపిస్తోందని పలువురు అనుకుంటున్నారు. గతంలో కూడా శేఖర్ కమ్ములపై ఆరోపణలు చేసి...ఆ తర్వాత శ్రీరెడ్డి యూటర్న్ తీసుకుంది. ఇపుడేమో ఎవరిపై ఫిర్యాదు కూడా చేయలేదు. నిజంగా శ్రీరెడ్డికి అన్యాయం చేసిన వారికి శిక్ష పడాల్సిందే. ఒక్క శ్రీరెడ్డి కే కాదు....టాలీవుడ్ లో అన్యాయం జరిగిన వారందరికీ న్యాయం జరగాల్సిందే. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ, దానికోసం తనకు అన్యాయం చేసిన వారిపై శ్రీరెడ్డి ఫిర్యాదు చేయాలి. కేసులు పెట్టి వారందరినీ కటకటాల వెనుకకు నెట్టాలి. కోర్టులను ఆశ్రయించాలి. లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి. అంతేకానీ, ఆమెకు అన్యాయం జరిగింది కాబట్టి....టాలీవుడ్ మొత్తాన్ని నిందించడం...ఇండస్ట్రీ అంతా ఇంతే అని జనరలైజ్ చేయడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా తన దగ్గర ఉన్న ఆధారాలతో శ్రీరెడ్డి....మీడియా చానెళ్లకు వెళ్లకుండా ....పోలీసులను ఆశ్రయించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి రోజూ న్యూస్ చానెళ్ల ప్రైమ్ టైమ్ లో శ్రీరెడ్డి ఎపిసోడ్ ను జనం చూసి బోర్ ఫీలవక ముందే ఆమె ఈ బ్లాక్ మెయిల్ ఎపిసోడ్ కు తెరదించడం మంచిదనే భావన వ్యక్తమవుతోంది.