Begin typing your search above and press return to search.

సలార్ 2 రిలీజ్ ఎప్పుడంటే?

By:  Tupaki Desk   |   10 July 2023 5:00 AM GMT
సలార్ 2 రిలీజ్ ఎప్పుడంటే?
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సలార్ సిరీస్ లో పార్ట్ 1 సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతోంది. హోంబలే ఫిలిమ్స్ ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా సలార్ 1 టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చి ఏకంగా 100 మిలియన్స్ వ్యూస్ కి క్రాస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు.

అయితే టీజర్ ని మాత్రం అన్ని భాషలకి కలిపి ఒకటే లాంచ్ చేయడం విశేషం. ఈ టీజర్ లో పెద్దగా డైలాగ్స్ లేకుండా సింపుల్ ఇంగ్లీష్ డైలాగ్స్ తో డిజైన్ చేయడంతో ఒకే టీజర్ తో దేశ వ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేశారు. ఇక సలార్ 1 సెప్టెంబర్ లో రిలీజ్ కానుండగా సీక్వెల్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకి రానుందనే ప్రశ్న అందరిలో ఉంది. దీనికి కూడా సమాధానం వచ్చినట్లే కనిపిస్తోంది.

కేజీఎఫ్ సిరీస్ తరహాలో ఏడాది సమయం తీసుకోకుండా కేవలం ఆరు నెలల వ్యవధిలోనే సలార్ 2ని కూడా రిలీజ్ చేయడానికి ప్రశాంత్ నీల్ సన్నాహాలు చేస్తున్నారంట. దీనికోసం ఇప్పటికే మెజారిటీ షూటింగ్ కూడా కంప్లీట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. సెప్టెంబర్ లో మొదటి పార్ట్ రిలీజ్ తర్వాత సలార్ 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై ప్రశాంత్ నీల్ కూర్చుంటారని తెలుస్తోంది.

వచ్చే ఏడాది సమ్మర్ కి సలార్ పార్ట్ 2ని రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ప్యాచ్ వర్క్ ఏమైనా ఉంటే సలార్ మొదటి పార్ట్ రిలీజ్ తర్వాత ప్రభాస్ డేట్స్ చూసుకొని కంప్లీట్ చేయాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది. సలార్ 1 మీద ఇప్పటికే హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

ఒక వేళ ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే సలార్ పార్ట్ 2 మాత్రం ఏకంగా 2 వేల కోట్లు కలెక్షన్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. సలార్ రిలీజ్ రోజున పార్ట్ 2 మూవీ కూడా ప్రేక్షకుల ముందుకి ఎప్పుడు రానుంది ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట.