Begin typing your search above and press return to search.
`ఫ్యామిలీ మ్యాన్- 2` తెలుగు వెర్షన్ డేట్ ఎపుడు?
By: Tupaki Desk | 22 Jun 2021 3:30 AM GMT`ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2` ఓటీటీలో రిలీజై విమర్శకుల ప్రశంసలతో పాటు గొప్ప ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. నటీనటుల పవర్ ప్యాక్డ్ పెర్ఫామెన్సెస్ తో పాటు తీవ్రవాదం నేపథ్యంలో థ్రిల్లర్ సిరీస్ ని గ్రిప్పింగ్ గా డ్రైవ్ చేయడంలో రాజ్ అండ్ డీకే పనితనానికి గొప్ప ప్రశంసలు దక్కాయి. మనోజ్ భాజ్ పాయ్ .. సమంత ఒకరితో ఒకరు పోటీపడి నటించారు. తమిళ రెబల్ టైగర్ రాజీ పాత్రలో సమంత నటన అసమానం అంటూ ప్రేక్షకులు కీర్తించారు. కొన్ని వివాదాలు కొనసాగుతున్నా ఫ్యామిలీమ్యాన్ 2 సీజన్ దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంది.
అయితే హిందీ భాషలో మాత్రమే సీజన్ 2 అందుబాటులో ఉంది. తెలుగు తమిళ భాషల్లో వీక్షించాలనుకున్న వారికి తీవ్ర నిరాశ ఎదురైంది. దానికి కారణమేమిటి? తెలుగు- తమిళ వెర్షన్లను ఎప్పటికి రెడీ చేస్తారు? అన్న ప్రశ్నలకు దర్శకనిర్మాతలు రాజ్ అండ్ డీకే ఆన్సర్ ఇచ్చారు. అన్ని భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేయాలని ఉన్నా కుదరలేదు. మహమ్మారీ వల్ల ప్రతిదీ ఆలస్యమైంది. కరోనా లాక్ డౌన్ ల వల్ల తీవ్ర అడ్డంకుల్ని ఎదుర్కొన్నాం. సెకండ్ వేవ్ మరింత ఇబ్బందులకు గురి చేసింది. నిజానికి 2020 వేసవి నాటికే ఈ సిరీస్ ని అందించాలని కోరుకున్నా ఆ పని చేయలేకపోయాం.
ఇక అనువాదం పరంగా కూడా పనులు వేగంగా పూర్తి చేయలేకపోయాం. పైగా తెలుగు-తమిళ వెర్షన్లపై ఆసక్తి ఎక్కువ ఉంది. అందుకు తగ్గట్టే క్వాలిటీగా అనువాదాల్ని అందించాల్సి ఉంటుంది. రాజీ పడకుండా డబ్బింగులు చేయాల్సి ఉంది కాబట్టి జాగ్రత్త తీసుకుంటున్నామని.. అందుకే ఆలస్యమవుతోందని అన్నారు.
ఫ్యామిలీమ్యాన్ 2 కథాంశం ఇతర భాషలలో వచ్చినా ఒరిజినాలిటీని వాస్తవిక సారాన్ని కోల్పోకూడదు. ప్రతిదీ అర్థవంతంగా సమకాలీకరించి మంచి భాషతో అందించాలని మేం కోరుకుంటున్నాం. ప్రస్తుతం ఈ ప్రక్రియ జరుగుతోంది. కానీ టైమ్ ఎక్కువ తీసుకుంటోంది.. అని రాజ్ అండ్ డీకే వెల్లడించారు.