Begin typing your search above and press return to search.
మాజీ ప్రేయసి వల్ల స్టార్ హీరో ఇంట్లో గొడవలు?
By: Tupaki Desk | 14 April 2020 4:50 AM GMTసృష్టిలో ఏ గొడవ చూసినా.. ఆ వెనక మగువ కనిపిస్తుంది. రామాయణం.. మహాభారతం వంటి పురాణేతిహాసాలు మొదలు.. గ్రీకుల ట్రాయ్ హిస్టరీ మొదలు.. సామాన్య మానవ భారతం వరకూ ప్రతిచోటా మగువ పాత్ర విశిష్ఠమైనది. ఇటీవల అలాంటి ఓ మగువ వల్ల ఆ స్టార్ హీరో ఇంట్లో కలతలు చెలరేగాయి. ఓ బర్త్ డే వేడుకలో జరిగిన రాద్ధాంతంపై సినీపరిశ్రమలో ఆసక్తికర చర్చ సాగింది.
ఆ బర్త్ డేకి ఎటెండయిన సెలబ్రిటీలంతా గుసగుసలాడుకునేందుకు కారణమైంది. ప్రముఖ స్టార్ హీరో సోదరి బర్త్ డే వేడుకకు ఎంటెండైన సదరు మాజీ ప్రేయసి కం ఫ్రెండు.. అనూహ్యంగా ఆ స్టార్ హీరో తమ్ముడి వైఫ్ ని కాపీ క్యాట్ అని పిలిచి గాలి తీసేసింది. ఆ ఈవెంట్ లో తన కాపీ క్యాట్ ఫ్యాషన్ బండారం బయట పెట్టేసింది. తాను పార్టీకి తొడుక్కొచ్చిన ఔట్ ఫిట్ పై `కాపీ` అంటూ సెటైర్ వేయడంతో అది కాస్తా చిన్నబుచ్చుకునేలా చేసింది. అసలే ఆ పార్టీ ఇచ్చిన స్టార్ హీరో సోదరుడి భార్యపై ఈ కామెంట్ విసిరేయడంతో అది కాస్తా ఇంట్లో గొడవలకు దారి తీసిందట. ఇలాంటి దానిని అసలు ఎందుకు పార్టీకి పిలిచావ్ ? అంటూ సదరు స్టార్ హీరో సిస్టర్ కం బర్త్ డే గాళ్ చికాకు పడిందట. మొత్తానికి ఆ గొడవ అప్పటికి సిద్ధుమణిగినా .. తన స్నేహితురాలు కం మాజీ ప్రేయసి అలాంటి కామెంట్ చేసింది కాబట్టి సదరు స్టార్ హీరో తనని ఏమీ అనలేకపోయాడట.
ఇంతకీ ఈ ఎపిసోడ్ లో ఆర్టిస్టులు ఎవరెవరు? స్టార్ హీరో ఎవరు? ఆయన సోదరుడెవరు? అతడి మాజీ ప్రేయసి ఎవరు? ఆమె ఎవరిపై కామెంట్ చేసింది? అంటే .. వరుసగా పేర్లు పరిశీలిస్తే... ఎపిసోడ్ లో స్టార్ హీరో- సల్మాన్ ఖాన్. ఆయన సోదరుడు ఆర్భాజ్ ఖాన్. మాజీ ప్రేయసి కం స్నేహితురాలు ఎవరు? అంటే కత్రిన కైఫ్. సోదరి కం బర్త్ డే గాళ్ ఎవరు? అంటే.. అల్విరా. తన పార్టీలోనే కత్రిన.. మలైకా గాలి తీసేసింది. దీంతో అంత గొడవైందన్నమాట. మలైకా నుంచి సల్మాన్ సోదరుడు ఆర్భాజ్ కలతల వల్ల ఇటీవల విడిపోయిన సంగతి తెలిసిందే.