Begin typing your search above and press return to search.

ఆంటీ అన్నందుకు కరీనా స్పందన ఇలా ఉంది

By:  Tupaki Desk   |   9 March 2019 6:23 AM GMT
ఆంటీ అన్నందుకు కరీనా స్పందన ఇలా ఉంది
X
భారతదేశంలో చాలామంది అమ్మాయిలకు.. మహిళలకు అసలు నచ్చని ఒకే ఒక పదం 'ఆంటీ'. ఆ పదాన్ని బ్యాన్ చేస్తామని ఏ పార్టీ అయినా తమ ఎలెక్షన్ మ్యానిఫెస్టోలో పెడితే వెంటనే చాలామంది లేడీసు పార్టీ చేసుకొని సదరు రాజకీయ పార్టీకు ఓటు వేయడం ఖాయమే. అన్నీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.. అని ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇచ్చే రాజకీయ నాయకులు ఇలాంటి సున్నితమైన.. మహిళల మనసుని బాధపెట్టే సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదో. అది సరేగానీ రీసెంట్ గా ఈ 'ఆంటీ' పదం పై బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ స్పందించింది.. కాదు కాదు స్పందించాల్సి వచ్చింది.

సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ 'పించ్' అనే పేరుతో ఒక సెలబ్రిటీ చాట్ షో మొదలుపెట్టాడు. పించ్ అంటే గిల్లడం.. టైటిల్ లోనే స్టొరీ అర్థం అయింది కదా. సెలబ్రిటీలను పిలిచి గిల్లుతాడన్నమాట. ఫిజికల్ గా గిల్లుడు కాదు.. అలాంటి బీ గ్రేడ్ ఆలోచనలను కట్టిపెట్టండి. మెంటల్ గా వారిని గిల్లే ప్రశ్నలు సంధిస్తాడు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కామెంట్స్ ను వారికి చూపించి సెలెబ్రిటీల అభిప్రాయం అడుగుతాడు. ఈ చాట్ షో మొదటి సీజన్ 10 ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తయిందట. నవాజుద్ధిన్ సిద్ధిఖి.. సోనాక్షి సిన్హా.. కరణ్ జోహార్.. కపిల్ శర్మ లాంటి అతిథులు ఈ చాట్ షో కు హాజరయ్యారు. పించ్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఆ షో లో కరీనా కు ఒక నెటిజన్ కరీనా పై చేసిన 'ట్రోల్' కామెంట్ ను చూపించి స్పందించమని కోరాడు.

ఆ నెటిజన్ కామెంట్ ఏంటంటే "నువ్విప్పుడు ఆంటీవి.. టీనేజర్ లాగా ప్రవర్తించకు". దీనికి సమాధానంగా "సెలబ్రిటీలకు ఫీలింగ్స్ ఉంటాయని.. ఎమోషన్స్ ఉంటాయని చాలామంది జనాలు అర్థం చేసుకోరు. సెలబ్రిటీలు..నటీనటులు అన్నిటినీ స్వీకరించాలి" అంటూ కరీనా జవాబిచ్చింది. కరణ్ జోహార్ ను ఒక నెటిజన్ "నువ్వు అలాంటి పిచ్చోళ్ళు వేసుకునే బట్టలు ఎందుకు వేసుకుంటావు?" అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా కరణ్ "నేను ఇలాంటివి పట్టించుకోను" అన్నాడు. మార్చ్ 12 నుండి ఈ చాట్ షో ప్రసారం అవుతుందట. ట్రైలర్ పై ఒక లుక్కేయండి.