Begin typing your search above and press return to search.
అసలు మహానటి ఎప్పుడు అయ్యారు
By: Tupaki Desk | 14 May 2018 12:36 PM GMTమహానటికి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చూసి సినిమా ప్రేమికులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సావిత్రి గారి జీవితాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించిన నాగ అశ్విన్ ప్రతిభకు సెల్యూట్ చేయని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. కాని అందరికి ఒక చిన్న అనుమానం ఉంది. అసలు సావిత్రి గారికి మహానటి బిరుదు ఎప్పుడు ఎక్కడ ఇచ్చారా అని. సినిమా పరిశ్రమ ఆ సమయంలో చెన్నైలోనే స్థిరపడినప్పటికీ మహానటి బిరుదు ఇచ్చిన అరుదైన సంఘటన మాత్రం హైదరాబాద్ లో జరిగింది. 1964లో ఆంధ్ర మహిళా సభ ఘనంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఈ బిరుదును ఆవిడకు అంకితం చేసారు. ఈ సీన్ సినిమాలో ఉంది. అక్కడే జెమిని గణేషన్ ఈగో దెబ్బ తిన్నట్టుగా చూపిస్తారు. వృత్తిపరమైన అసూయను అక్కడి నుంచే జెమినీ గణేషన్ వ్యక్తిగతంగా మార్చుకోవడం మొదలవుతుంది. మహానటి సినిమాలో చూపించిన ప్రకారం ఆవిడ జీవితంలో భార్య భర్తల మధ్య అపార్థాలు ఇక్కడి నుంచే మొదలవుతాయి.
ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇద్దరినీ ఏనుగు మీద కూర్చోబెట్టి ఊరేగించడం అప్పట్లో సంచలనం రేపింది. కాని దాని కంటే ముందే ఆ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగినట్టుగా కొన్ని పుస్తకాల్లో ఉంది. ఆ కారణంగానే సావిత్రి గారు ఏనుగు మీద కూర్చున్నంత సేపు ముభావంగా ఉన్నారని దానికి విరుద్ధంగా జెమిని గణేషన్ ఉల్లాసంగా ఉన్నాడని ఫోటో సాక్ష్యం కూడా అందులో పొందుపరిచారు. కాని సినిమాలో మాత్రం కొంత విరుద్ధంగా ఉంటుంది. ఏదైతేనేం సావిత్రి గారి జీవితంలో అతి కీలకమైన మహానటి బిరుదు ప్రధానం ఇంతటి విషాదానికి ఒక కారణం అవుతుందని ఆవిడతో సహా ఎవరు కనీసం ఊహించి కూడా ఉండరు. ఇప్పుడు మహానటి విడుదల తర్వాత సావిత్రి గారి జీవితానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు అరుదైన ఫోటోల గురించి సోషల్ మీడియాలో చాలా ఆసక్తి కనిపిస్తోంది. నాగ అశ్విన్ చేసిన ప్రయత్నం ఇప్పటి తరాన్ని సావిత్రి గారి గురించి తెలుసుకునేలా ప్రేరేపించడం అంటే గర్వపడే విషయమేగా.