Begin typing your search above and press return to search.
శ్రీదేవి మిస్టరీ గుట్టు విప్పిన మేనమామ
By: Tupaki Desk | 4 Jun 2020 3:45 AM GMTఅతిలోక సుందరి శ్రీదేవి మరణం వెనక మిస్టరీ దాగి ఉందనేది అభిమానుల మాట. ఆమె అంతర్థానమై రెండేళ్లు అయినా ఇప్పటికీ అదే నమ్ముతారు ఫ్యాన్స్. దుబాయ్‌లో శ్రీదేవి మరణించిన తరువాత ఆమె భర్త బోనీ కపూర్ కలతకు గురయ్యారు. కానీ బోనీ ఆయన కుమారుడు అర్జున్ కపూర్ పై అభిమానులు రకరకాల సందేహాల్ని వ్యక్తం చేశారు. ఇకపోతే శ్రీదేవి గురించి సర్వం తెలిసిన తన మేనమామ వేణుగోపాల్ రెడ్డి చెప్పిన సంగతులు పూర్తి కాంట్రాస్ట్ అనిపించక మానవు. శ్రీదేవి జీవితం గురించి.. తన సోదరి శ్రీలత.. సవతి కుమారుడు అర్జున్ కపూర్.. భర్త బోనీ కపూర్ గురించి.. అలాగే శ్రీదేవి సౌందర్య శస్త్రచికిత్సలు.. ఆర్థిక అస్థిరత గురించి ఎవరికీ తెలీని నిజాల్ని వెల్లడించారు.
శ్రీదేవి ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడిన వేణుగోపాల్ రెడ్డి.. తాను ఎంతో బాధతో జీవించిందని.. గుండెల్లో పుట్టెడు దుఃఖం పెట్టుకుని కన్నుమూసిందని తెలిపారు. ``బోనీ కపూర్ కొన్ని ఫ్లాపులు తీసి చాలా డబ్బును పోగొట్టుకున్నాడు. ఆ నష్టాల్ని పూడ్చేందుకు శ్రీదేవి ఆస్తులను అమ్మారు. శ్రీదేవికి ఎప్పటికీ అదో పెయిన్ లా ఉండిపోయింది. శ్రీదేవి బాధతో జీవించి చాలా బాధతో కన్నుమూశారు. తను ఏనాడూ ప్రశాంతంగా లేదు. ప్రపంచం కోసం ఆమె ముఖంపై చిరునవ్వు ధరించిందే కానీ ఆమె తన లోనే ఎంతో మదనపడేది`` అని రెడ్డి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
``బోనీ ఒక చిత్రాన్ని నిర్మించాడు. అది రిలీజ్ కి నోచుకోలేదు. అప్పటికే అతడు ఆర్థికంగా క్లిష్ట దశలో ఉన్నారు. శ్రీదేవి తన ఆస్తులను విక్రయించి.. జీవితాన్ని తిరిగి దారిలోకి తేవడానికి ఆ అప్పులను క్లియర్ చేసింది. శ్రీదేవి తిరిగి సినిమాల్లోకి రావడానికి ఇది ప్రధాన కారణమైంది`` అని ఆయన అన్నారు.
శ్రీదేవి మరణం వెనక మిస్టరీ ఉందని ఊహాగానాలకు దారితీసిన క్రమంలో ఈ విషయంపై కొంత స్పష్ఠతనిచ్చారు రెడ్డి. వాస్తవానికి శ్రీదేవి అప్పటికే కొన్ని ప్రలోభాలకు లోనయ్యిందని తెలిపారు. అది చాలా కాలం క్రితమేనని అన్నారు. ``అందం కోసం ఆమె ముక్కుపై రెండు శస్త్రచికిత్సలు చేసారు. అమెరికా వెళ్లి ముక్కుకి శస్త్రచికిత్సలు చేయించుకున్నాక మరింత అందంగా కనబడాలని కోరుకుంది. తన తల్లితో ఫోన్లో మాట్లాడితే ఆ విషయం తెలిసింది`` అని రెడ్డి చెప్పారు.
శ్రీదేవి తన సోదరి శ్రీలతకు మధ్య ఆస్తి వివాదం ఉంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. తోబుట్టువుల మధ్య అప్పటికి మాటల్లేవ్. అలాగే శ్రీదేవి తల్లికి యుఎస్ లో ఆపరేషన్ చేసారు. వైద్యులు ఆమె మెదడుకు ఆపరేషన్ జరగాల్సిన వైపు కాకుండా వేరొక వైపు శస్త్రచికిత్స చేశారు, అందువల్ల ఆమె పూర్తిగా మంచం పట్టింది. ఆమె సజీవంగా ఉన్నా కానీ ఇంద్రియాలు పని చేయలేదు. ఆమె కేవలం ఒక వస్తువుగా మారింది`` అని తెలిపారు. శస్త్రచికిత్సలో తప్పిదం తెలిశాక ఆ అమెరికన్ ఆసుపత్రిపై కేసు పెట్టారు. ఈ ప్రక్రియలో బోనీ కపూర్ శ్రీదేవితో పాటు ఉన్నారు. కోర్టు ఆసుపత్రికి జరిమానా విధించింది.
అలాగే శ్రీదేవి -శ్రీలతలకు ఆస్తి గొడవలు ఉన్నా.. ఆ తర్వాత శ్రీదేవి తల్లి ఆస్పత్రి ఖర్చుల్ని మొత్తాన్ని తరువాత కుటుంబ సభ్యులు క్లియర్ చేశారు. ఆస్పత్రి ఇచ్చిన పరిహారంలో వాటాతో పాటు శ్రీదేవి తన సోదరి శ్రీలతకు చాలా డబ్బు పంపించేవారు. శ్రీలత కుటుంబం ఇప్పటికీ బాగానే ఉన్నారు.
బోనీ కపూర్‌తో శ్రీదేవి వివాహాన్ని తన తల్లి వ్యతిరేకించారు. బోనీని ఎప్పటికీ ఆమె సరిగా పట్టించుకోలేదు. వాస్తవానికి బోనీ కపూర్‌ను వివాహం చేసుకోవడం శ్రీదేవి తల్లికి నచ్చలేదు. అతను ఇంటికి వచ్చిన రెండు సందర్భాలలో ఆమె తల్లి అతడిని సరిగా ట్రీట్ చేయనే లేదు. కానీ బోనీ కపూర్ శ్రీదేవిని వివాహం చేసుకోవాలనుకున్నారు. శ్రీదేవి తల్లి ఆ విషయం మాతో చర్చించింది. కానీ చివరికి వారు ఇంట్లో వారిని వ్యతిరేకించి వివాహం చేసుకున్నారు`` అని రెడ్డి చెప్పారు.
శ్రీదేవి కెరీర్ ప్రారంభ రోజుల పోరాటం గురించి రెడ్డి మాట్లాడుతూ ``శ్రీదేవి ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాధారణ యువతి. తనను సినిమాల్లోకి తీసుకురావడానికి ఆమె తల్లి చాలా కష్టాలను ఎదుర్కొంది. శ్రీదేవి ఆహారం.. దుస్తులు .. ఇతర విషయాల గురించి ఆమె తల్లి చాలా జాగ్రత్తలు తీసుకునేది. శ్రీదేవి కూడా తన తల్లికి విధేయురాలు. శ్రీదేవికి అసలు విద్య అన్నదే లేదు. ఆమె సినిమాల్లోకి వచ్చి చెన్నైలో నివసిస్తున్నప్పుడు.. ఒక ఉపాధ్యాయుడు ఇంటికి వచ్చి ఆమెకు నేర్పించేవాడు`` అని తెలిపారు.
బోనీ కపూర్ మొదటి భార్య మోనా కపూర్ కు జన్మించిన తన సవతి కుమారుడు అర్జున్ కపూర్ నుంచి శ్రీదేవి చాలా సవాళ్లను ఎదుర్కొన్నారు. ఫ్యామిలీ విచ్ఛిన్నం అయ్యిందన్న కోపం అర్జున్ లో అలానే ఉండిపోయింది.
ఆ క్రమంలోనే శ్రీదేవి తన బంధువులలో కొంతమందికి అర్జున్ కపూర్ తో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నట్లు ప్రస్తావించారు. కానీ దాని గురించి నాకు అంతగా తెలియదని మేనమామ రెడ్డి గారు తెలిపారు. మా బంధువులు కొద్దిమంది శ్రీదేవిని కలిసినప్పుడు వారి సంభాషణలో ఆమె ఆందోళన చెందుతోందని.. కుమార్తెలు జాన్వీ - ఖుషీ భవిష్యత్తు గురించి బాధపడుతోందని.. బోనీ ఆరోగ్యం బాగాలేదని.. అతని ఆరోగ్యం కాస్త ఆందోళన కలిగిస్తోందని శ్రీదేవి కలతకు గురయ్యారని తెలిపారు. ఇలా శ్రీదేవి జీవితం అంతా ఎంతో దుఃఖం నిండి ఉంది. అన్ని కష్టాల నడుమ దుబాయ్ పెళ్లి వేడుక కోసం వెళ్లి అక్కడే ఆకస్మికంగా బాత్ టబ్ లో జారిపడి (అలా నమ్మించారు!) మృతి చెందారు.