Begin typing your search above and press return to search.

రాజమౌళి కుటుంబం సర్వం కోల్పోయినప్పుడు సిరివెన్నెల..!

By:  Tupaki Desk   |   1 Dec 2021 4:18 AM GMT
రాజమౌళి కుటుంబం సర్వం కోల్పోయినప్పుడు సిరివెన్నెల..!
X
ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ మృతి తెలుగు సినిమా కు తీరని లోటు. ఆయన ఎన్నో పాటలను రాసి ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించాడు.. ఎంతో మందికి ప్రేరణగా నిలిచాడు. ఆయన పాటలు వింటూ ఉంటే జీవితం ముందు చాలా ఉంది.. కష్టపడితే అద్బుత విజయాలను సొంతం చేసుకోవడం కష్టం ఏమీ కాదు అనే విశ్వాసం కలుగుతుంది అనడంలో సందేహం లేదు. అలాంటి విశ్వాసంను రాజమౌళి ఫ్యామిలీ ఒకానొక సమయంలో సిరివెన్నెల పాటల నుండి పొంది జీవితంలో ముందుకు సాగారట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి చెప్పుకొచ్చాడు. సిరివెన్నెలకు ఘన నివాళ్లు అర్పించిన రాజమౌళి ఆయనతో ఉన్న అనుబంధంను నెమరవేసుకున్నాడు.

రాజమౌళి మాట్లాడుతూ.. అర్థాంగి సినిమాను మా కుటుంబ సభ్యులు 1996 లో నిర్మించడం జరిగింది. ఆ సినిమా డిజాక్టర్‌ అవ్వడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏం చేయాలో తోచని పరిస్థితి.. కనీసం ఇంటి రెంటు కట్టలేకుండా పరిస్థితి అయ్యింది. సమయంలో సిరివెన్నెల గారు రాసిన ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి పాట మా కుటుంబంకు స్ఫూర్తిగా నిలిచింది. ఆయన మా కుటుంబంను తన రచనతో ముందుకు నడిపించాడంటూ రాజమౌళి ఎమోషనల్‌ అయ్యారు. ఆ సమయంలో ఒక రాత్రి మద్రాస్ లోని ఆయన ఇంటికి వెళ్లి ఒక నోట్‌ బుక్ లో ఆ పాటను రాయించుకుని నాన్న గారికి ఇచ్చాను. ఆయన చాలా ఆనందించారు.. ఆయన తర్వాత రోజు నుండి చాలా ఉత్సాహంగా కనిపించారంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు ఎన్నో పాటలను రాజమౌళి అందించాడు. అందులో సింహాద్రి సినిమాలో అమ్మయినా నాన్నయినా లేకుంటే.. అనే పాట మరియు మర్యాదరామన్న సినిమాలోని పారిపోవడం గొప్ప అని రాశారు. మొదట ఈ పాటలను రాసేందుకు ఆయన ఒప్పుకోలేదు. అమ్మా నాన్న లేకుండా సంతోషం ఎలా.. పారిపోవడం గొప్ప విషయం ఎలా అవుతుంది అంటూ రాజమౌళితో సిరివెన్నెల వారు వాదనకు దిగారట. ఆ తర్వాత కాన్సెప్ట్‌ మొత్తం చెప్పిన తర్వాత ఛాలెంజ్ గా తీసుకుని అద్బుతమైన అర్థం వచ్చేలా ఆయన పాటను ఇచ్చారని రాజమౌళి చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన నుండి వచ్చిన ఎన్నో వందల పాటలు ఇప్పుడే కాదు రాబోయే తర తరాలకు కూడా జీవితంలో ముందుకు నడిపేందుకు దోహద పడతాయనడంలో సందేహం లేదు.